Saina nehwal beats pv sindhu india grand prix

Saina Nehwal,PV Sindhu,India Grand Prix Gold, Saina Nehwal beats PV Sindhu, Nehwal snapped, 15 months

India ace shuttler Saina Nehwal snapped her 15 months title drought, clinching the Syed Modi International India Grand Prix Gold.

సైనా నెహ్వాల్ కి ఎట్టకేలకు టైటిల్

Posted: 01/27/2014 10:44 AM IST
Saina nehwal beats pv sindhu india grand prix

భారత షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ గెలిచిన తరువాత వరుస పరాజయాల పాలవుతున్న ఈమె ఎట్టకేలకు తన ఖాతాలో ఇండియన్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ వేసుకుంది. దాదాపు 15 నెలల తరువాత అంతర్జాతీయ టైటిల్ ని గెలిచిన సైనా నెహ్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భారత నయా సంచలనం అయిన పి.వి. సింధు పై గెలిచి ఈ టైటిల్ గెలుచుకుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య జరిగిన హోరా హోరీ పోరులో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఆదివారం  40 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సహచర హైదరాబాదీ పీవీ సింధుపై 21-14, 21-17 స్కోరుతో సైనా నెగ్గింది. తొలి గేమ్‌లో శుభారంభం చేస్తూ సైనా 5-0 తో దూసుకుపోయింది.

తరువాత పుంజుకున్న సింధు స్కోరును 12-14కు చేర్చినా, చివర్లో సైనా మెరుపు వేగంతో ఆడటంతో సింధు విజయం ముంగిట బొల్తా పడింది. గతేడాది ఐబీఎల్‌లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గిన సైనా, ఈసారీ తన జోరు కొనసాగించింది. చాలా కాలం తరువాత ఈ టైటిల్ గెలవడంతో సైనా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ టైటిల్ ని కోచ్ గోపీ చంద్ కి, తన తల్లిదండ్రలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles