Roger federer fells andy murray australian open

Roger Federer, Andy Murray, Australian Open, Rafa Nadal,semi-final, Roger Federer fells Andy Murray

A resurgent Roger Federer weathered a belated challenge from Andy Murray at the Australian Open on Wednesday to win 6-3 6-4 6-7(6) 6-3.

ఫెడెక్స్ మళ్ళీ ఫాంలోకి వచ్చాడు

Posted: 01/23/2014 12:53 PM IST
Roger federer fells andy murray australian open

స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మళ్ళీ పూర్వవైభవం సంపాదించుకోబోతున్నాడా ? తనలో సత్తా తగ్గిందని ఇక టెన్నిస్ కి స్వస్థి చెప్పాల్సిన సమయం వచ్చిందని నిందలు మోపిన వారికి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ కి చేరి తనలో ఏ మాత్రం చేవ తగ్గలేదని తన ఆట ద్వారా వారికి సమాధానం చెప్పాడు. పదునైన సర్వీస్ లతో టెన్నిస్ ప్రేక్షకులకు చాలా రోజుల తరువాత వినోదాన్ని పంచిన ఫెడెక్స్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఫెడరర్ 6-3, 6-4, 6-7 (6/8), 6-3తో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలుపొందాడు.

గతేడాది ఇదే టోర్నీలో ఐదు సెట్‌లపాటు జరిగిన సెమీఫైనల్లో ముర్రే చేతిలో ఎదురైన ఓటమికి ఈసారి బదులు తీర్చుకున్నాడు. ముర్రేతో 3 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 10 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్‌వద్దకు 66 సార్లు వచ్చి 49 సార్లు పాయింట్లు నెగ్గాడు.  ఈ గెలుపుతో వరుసగా 11వ ఏడాది సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన ఆటగాడిగా నిలిచాడు. సెమీ ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ తో పోరుకు సిద్దం అయ్యాడు. ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles