శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో కనకదుర్గమ్మ | Kanaka Durga Devi as Sri Maha Laxmi Devi in Saranavaratrulu

Kanaka durga devi as sri maha laxmi devi

Kanaka Durgamma as Sri Maha Laxmi Devi, Sri Maha Laxmi Devi avatar in Saranavaratrulu, Kanakadurgamma Saraavaratrulu, Dussera Durga Devi forms, Sri Maha Laxmi Devi story, Sri Maha Laxmi Devi history, Sri Maha Laxmi Devi saranavaratrulu

Kanaka Durgamma as Sri Maha Laxmi Devi in Saranavaratrulu.

శరన్నవ రాత్రులు నేడు శ్రీ మహాలక్ష్మి దేవి

Posted: 10/07/2016 10:08 AM IST
Kanaka durga devi as sri maha laxmi devi

నేడు(ఆశ్వయుజ శుద్ధి షష్టి) అమ్మవారికి మహాలక్ష్మీ అలంకారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. స్త్రీశక్తిని కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనక దుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తుంది.

శ్రీ మహా లక్ష్మీ దేవిని వివిధ రీతులలో పూజించే సాంప్రదాయములు లోకములో గలవు. ఎవరి కోరికలను బట్టి వారు వివిధ నామములతో ఆ మహాదేవిని కొలవవచ్చును. అధికారమును కోరేడి వారు శ్రీ మహా లక్ష్మిని సామ్రాజ్యలక్ష్మీ దేవిగా, ఓం శ్రీం  రాజమాతంగై నమః ...అని ఉపాసించ వలెను. ఐశ్వర్యమును కోరేడి వారు శ్రీ మహాలక్ష్మిని కుబేర మంత్ర సహితముగా పూజించ వలెను. గో సంపద కోరేడి వారు గో శాల యందు కూర్చొని లక్ష్మీ స్తోత్రం చేయ వలెను.

బ్రహ్మ పురాణంలో భగవానుడైన విష్ణు మూర్తి స్వయముగా శ్రీ లక్ష్మి సహస్రనామము గూర్చి బ్రహ్మకు ఉపదేశించినాడని తెలుప బడుతోంది. పూర్వం బ్రహ్మ దేవుడు కృతయుగంలో లోకసృష్టి జరిపినాడు, కాని తన అనంత సృష్టి వలన మానవాళికి కావలసిన ఆహారము ఏ విధముగా సమకూర్చ వలెను అని ఆలోచనలో పడెను.

ప్రజలందరూ సుఖముగా జీవించుటకు, సర్వ సంపదలు పొందుటకు,దారిద్ర్యము పారద్రోలుటకు ఏమిటి ఉపాయము అని సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తిని ప్రార్ధించుట కొరకై గొప్ప తపము ఆచరించెను. అంతట లక్ష్మీ నారాయణుడు సంతసించి బ్రహ్మ దేవునికి సాక్షాత్కారించెను. దారిద్ర్య నాశనమునకు నివారణోపాయములు తెలుపమని వేడుకొనగా ఆ శేషశాయి ప్రసన్నుడై, శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క సహస్ర నామములను బ్రహ్మకు ఉపదేశించెను. ఈ పారాయణ  చాలా అత్యుత్తమైనది. అన్ని జీవుల యందు వున్న ప్రాణ శక్తియే ఈ మహా లక్ష్మి. ధనాశతో జీవుని బంధించు కర్మ స్వరూపిణి మాత్రమె కాకుండా మోక్షమును ప్రసాదించే మోక్ష లక్ష్మి కూడా ఈమెయే అయినది.. జీవుడు చతుర్విధ పురుషార్ధములలో ముందుగా ధర్మము సాధన చేసి అనంతరము అర్ధము (ధనము) పొందవలెనని ఆశించితే ఆ శ్రీదేవి  ముందు జీవుని సమస్త కోరికలను తీర్చి అనంతరము మోక్షమును ప్రసాదించును.

శ్రీ మహాలక్ష్మీ ధ్యానము చేయు విధానము:- శ్రీ మహాలక్ష్మీ దేవి యొక్క చిత్తేరవు(పటము) ఈ క్రింది విధముగా వున్నది ఎంచుకొనవలెను. శ్రీ మహాలక్ష్మీ దేవి పద్మాసనస్థురాలిగాను శ్రీ లక్ష్మీ దేవి యంత్రమున లేదా పద్మమున  ఆసీనురాలై ఉండవలెను. ఆ దేవికి ఇరుప్రక్కల రెండు తెల్ల ఏనుగులు అమృత కలశములతో అభిషేకము జరుపుతున్నట్లుగా ఉండవలెను. ఇంకా ఆ మహాదేవి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఐరావతము, శంఖనిధి, పద్మనిధి, మొదలైన నవ నిధులతో సేవించ బడుతున్నట్లు ఉండవలెను. తెల్లని చత్రము, రెండు చామరములచే మహారాజోపచారం పొందుచున్నట్లు ఉండుచూ రెండు హస్తముల యందు రెండు పద్మములు ధరించుతూ వరద, అభయ ముద్రలతో సర్వ రత్నాభరణ భూషితయై ఐశ్వర్యమును సిద్ధింపజేయు మాతృమూర్తిగా మహాలక్ష్మిని ధ్యానించవలయును.

శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ పీఠము నందు ఉండే దయయే అనుగ్రహ మూర్తిగా రూపుకట్టి సాక్షాత్కరించిన మూర్తియే శ్రీ మహాలక్ష్మి.  కావున మహా లక్ష్మీ అనుగ్రహము కొరకు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ పీఠమును అలంకరించిన ఆ మహా తల్లిని కొలవవలయును. ఈ దేవిని కొలుచుటకు అనుకూలమైన దినములు, విశేష ఫలితములు నొసంగే అనువైన పర్వదినములు శరన్నవరాత్రములు మరియు శ్రావణ మాసము.  

ముందుగా సాధకుడు శ్రీ మహాలక్ష్మిని పైన తెలిపిన విధానముగా, శక్త్యానుసారముగా బంగారంతో గాని, వెండితో గాని లేదా పంచాలోహములతో చేసిన విగ్రహము గానీ, కనీసం పటమునైనా గాని తీసుకొనవలయును. పీఠముపై ధాన్యము పోసి సమానముగా చేసి, గులాబీ రంగు పట్టు వస్త్రమును ఉంచి, బియ్యము పిండి, పసుపు, కుంకుమ, చందనములతో అందముగా రంగు వల్లికను వేసి, అమ్మ వారి విగ్రహమును గానీ, పటమును గానీ స్థాపించ వలయును. అనంతరము ఆ దేవి విగ్రహము ముందు కలశమును, లక్ష్మీ యంత్రమును స్థాపించి, ఆవు నేతితో గానీ, లేక నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేయవలెను. ధూపమును వేయవలెను.

దేవి విగ్రహమునకు ఎర్రని పువ్వులతో, పరిమళములను వెదజల్లు పుష్పములతో అందముగా అలంకరించి, బంగారు నగలతో ఆమెకి అలంకారము చేసి, పూజ ప్రాంభించ వలెను. గురుదేవులను, విఘ్నేశ్వరున్ని ధ్యానించి, ప్రాణాయామము చేసి లక్ష్మీ దేవి యొక్క మూల మంత్రమును మనస్సు నందు 108 సార్లు అంగన్యాస, కరన్యాసములతో, జపము చేయవలెను. శ్రీ మహా విష్ణువును ఆరాధించవలెను. కల్పోక్త ప్రకారము శ్రీ మహాలక్ష్మి దేవికి షోడశోపచారములచే పూజ చేసి, అనంతరము లక్ష్మీ సహస్ర నామార్చన వేదోక్త ప్రకారముగా చేయ వలెను. తరువాత లక్ష్మీ దేవికి ప్రీతికరమైన నైవేద్యములు సమర్పించి, మంత్ర పుష్పములతో పుష్పాంజలి సమర్పించి, కర్పూర నీరాజనము ఇచ్చి, లక్ష్మీ దేవిపై సంకీర్తన గానం చేయవలెను.


మహాలక్ష్మి అష్టకం
నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]

ఇలా చేసిన వారిపై అమ్మ యొక్క అనుగ్రహము సంపూర్ణముగా అన్ని సమయముల యందు ప్రసరింప చేయుచుండును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanaka Durgamma  Avatars  saranavaratrulu  Sri Maha Laxmi Devi  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more