శ్రీ సరస్వతీ దేవి అవతారంలో కనకదుర్గమ్మ | sri saraswathi devi Saranavaratrulu

Saranavaratrulu sri saraswathi devi avatar

Durga Navaratrulu, Kanaka Durgamma as sri saraswathi devi, sri saraswathi devi History, sri saraswathi devi Kanaka Durga

Kanaka Durgamma as sri saraswathi devi in Saranavaratrulu.

శరన్నవరాత్రులు ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవి

Posted: 10/08/2016 10:16 AM IST
Saranavaratrulu sri saraswathi devi avatar

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణములు వర్ణిస్తున్నాయి. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది. శ్వేత పద్మాన్ని ఆసనముగా అధీష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసభగవానుడు, వాల్మీకిమహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు అమ్మ వాగ్వైభవమును వరముగా అందచేసింది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది. త్రిశక్తి స్వరూపములలో సరస్వతీదేవి మూడొవ శక్తిరూపము. సంగీత సాహిత్యములకు అమ్మ అథిష్టాన దేవత. సకల జీవుల జిహ్మాగ్రముపై అమ్మ నివాసము ఉంటుంది.     

''యా కుందేందు తుషారహార
దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత
కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి
భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా"

ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది. సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి.  


శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రమ్‌

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రికా    
శివానుజా పుస్తకధృత్‌ జ్ఞానముద్రా రమా పరా
కామరూపా మహావిద్యా మహాపాతక నాశినీ    
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా
మహాభాగా మహోత్సాహా దివ్యాఙ్గా సురవన్దితా    
మహాకాళీ మహాపాశా మహాకారా మహాఙ్కుశా
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ    
చన్ద్రికా చన్ద్రలేఖావిభూషితా మహాఫలా
సావిత్రీ సురసా దేవీ దివ్యాలఙ్కార భూషితా    
వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా
గోవిన్దా భారతీ భామా గోమతీ జటిలా తథా    
విన్ధ్యవాసా చణ్డికా చ సుభద్రా సురపూజితా
వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైక సాధనా    
సౌదామినీ సుధామూర్తి స్సువీణా చ సువాసినీ
విద్యారూపా బ్రహ్మజాయా విశాలా పద్మలోచనా    
శుంభాసుర ప్రమథినీ ధూమ్రలోచన మర్దనా
సర్వాత్మికా త్రయీమూర్తిః శుభదా శాస్త్రరూపిణీ    
సర్వదేవ స్తుతా సౌమ్యా సురాసుర నమస్కృతా    
రక్తబీజ నిహన్త్రీ చ చాముణ్డా ముణ్డకాంబికా    
కాళరాత్రీ ప్రహరణా కళాధారా నిరఞ్జనా
వరారోహా చ వాగ్దేవీ వారాహీ వారిజాసనా    
చిత్రాంబరా చిత్రగన్ధా చిత్రమాల్య విభూషితా
కాన్తా కామప్రదా వన్ద్యా రూప సౌభాగ్యదాయినీ    
శ్వేతాసనా రక్తమధ్యా ద్విభుజా సురపూజితా
నీలభుజా నీలజఙ్ఘా చతుర్వర్గ ఫలప్రదా    
చతురానన సామ్రాజ్ఞీ బ్రహ్మ విష్ణు శివాత్మికా
హంసాసనా మహావిద్యా మన్త్రవిద్యా సరస్వతీ    
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరం శతమ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanaka Durgamma  sri saraswathi devi  Saranavaratrulu  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more