ఎన్టీఆర్ గార్డెన్
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సరస్సుకు చేరువలో 36 ఎరకాల విస్తీర్ణంలో వున్న ఈ ఉద్యానవన ప్రదేశం... 1999 నుంచి అనేక దశలలో నిర్మించబడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల కింద విధులు పాటించే బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ దీనిని నిర్వహించింది. ఈ గార్డెన్ కి చేరువలోనే బిర్లా మందిర్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ వంటి ఇతర ప్రత్యేక ఆకర్షణలు కూడా వున్నాయి.