క్యారెట్
మానవ శరీరానికి అవసరమయ్యే విటమిన్లు ఇందులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా ఇవి కళ్లు, చర్మ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. క్యారెట్ లో వుండే విటమిన్ ఏ సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే చిన్నవయస్సులోనే పెద్దవారిలా కనిపించే లక్షణాలను తొలగించడంతోపాటు వృద్ధాప్యం, చర్మం రంగును, మొటిమలు, చెదురుమదురుగా వుండే చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. క్యారెట్లను ఫేస్ ప్యాక్ లా కూడా తయారుచేసుకుని, ముఖాన్ని మర్దన చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి ఎంతో మంచిది.