Rape attempt in kukatpalli hyderabad

blue films, rape attempt in hyderabad, rape attempt in kukatpalli,women raped, an old man raped women, hyderabad police, kphb bharath nagar colony, kphb hyderabad, rapist, sandhya,

rape attempt in kukatpalli hyderabad

19.gif

Posted: 12/11/2012 03:12 PM IST
Rape attempt in kukatpalli hyderabad

 rape_smaleee

        నలుగురికి మంచి వల్లించాల్సిన ఓ వృద్ధుడు తన కూతురు వయసు గల పనిమనిషితో చేసిన భాగోతమిది. తన ప్లాట్ లో  అశ్లీల చిత్రాలు చూపించి.. అత్యాచారం చేయబోయి ప్రస్తుతం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్లో ఊసలు లెక్కిస్తున్నాడీ వృద్ధ కాముడు.
        వివరాల్లోకి వెళితే, కేపీహెచ్‌బీకాలనీ భగత్‌సింగ్‌నగర్ కాలనీ ఫేజ్-2లో బసవరాజు (60) నివాసముంటున్నాడు. విశాఖజిల్లా యలమంచిలికి చెందిన సంధ్య (21), సాయికృష్ణ దంపతులు రెండు నెలలుగా ఇతని ఇంట్లో పని చేస్తున్నారు. బసవరాజు ఇంట్లోనే ఓ గదిలో వీరు ఉంటున్నారు. భర్త వాచ్‌మన్/ డ్రైవర్‌గా పని చేస్తుండగా... భార్య వంట పని చేస్తోంది.
       ఇదిలా ఉండగా, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బసవరాజు.. సంధ్యను తన గదిలోకి పిలిచి ల్యాప్‌టాప్‌లో అశ్లీల చిత్రాలు చూపించబోయాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని, మీరు నాకు తండ్రిలాంటి వారని చెప్పి వచ్చేయబోగా అత్యాచారం చేయబోయాడు. సంధ్య అతడి నుంచి తప్పించుకొని.. ఏడుస్తూ గది నుంచి బయటకు వచ్చేసింది.
       అంతటితో ఆగకుండా బసవరాజు, అతని భార్య... సంధ్యను పిలిచి ‘‘ నీకు డబ్బు ఇస్తాం.. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు.. లేదంటే చంపేస్తామని’’ బెదిరించారు. బాధితురాలు భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతను వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jewellery hidden in old walls
Actress divya prathibha missing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more