హీరోయిన్ల వ్యక్తిగత వ్వవహారాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. తారలు చాలావరకు వాటిని వ్యక్తపరిచేందుకు అంతగా ఆసక్తి చూపరు కానీ.. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా వెల్లడించాల్సి వస్తుంది. దీంతో మీడియాకు ప్లస్ పాయింట్ అవుతుంది.. తారలక్కూడా కొత్త ప్రచారం చేసుకున్నట్లుగా అవుతుంది.. ఫ్యాన్స్ సైతం వాటిని ఆచరించడంలో ఆసక్తి చూపుతారు. బాయ్ ఫ్రెండ్స్, పెళ్లి వ్యవహారాలను పక్కనపెడితే.. తారల ఇష్టాయిష్టాలు, వారి అలవాట్లను ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడుతారు. పైగా అవి చాలా ఆసక్తికరంగానూ వుంటాయి. అందుకు ఉదాహరణగా ‘క్వీన్’ భామ కంగనా రనౌత్ నే తీసుకోవచ్చు.
కంగనా చాలావరకు తన గురించి ఎక్కువ విషయాలను వెల్లడించదు. సినిమా ప్రమోషన్లలో, ఏదైనా ఫ్యాషన్ కార్యక్రమాల్లో తప్ప ఎక్కువగా కనిపించదు. కానీ ఈమెకి ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువే! ఇటీవలే ‘క్వీన్’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈమె డిమాండ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె ‘తను వెడ్స్ మను’ సీక్వెల్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ఈమె.. ఓ సందర్భంలో తన వ్యక్తిగత వ్యవహారాలను వెల్లడించింది. గతంలో తాను ఎన్నడూ పాటించని అలవాట్లను ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో అలవర్చుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఆ విషయాలేంటో పూర్తిగా ఆమె మాటల్లోనే...
‘తను వెడ్స్ మను’ చిత్రం నన్ను ప్రతి కుటుంబానికీ పరిచయం చేసింది. మొదట హీరో మాధవన్ ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చెప్పి, తర్వాత దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌ని కలవమని చెప్పారు. అలా వచ్చిందా అవకాశం. ఇప్పడు ‘తను వెడ్స్ మను’ సీక్వెల్లో కూడా చేస్తున్నా. ఈ సినిమా చిత్రీకరణ నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ లక్నోలోని రిజ్వి హౌస్‌లో జరిగింది’ అని తన చిత్ర విశేషాలను వెల్లడించింది. అనంతరం అక్కడ తాను ఎంజాయ్ చేసిన క్షణాలు, కొత్త అలవాట్ల గురించి పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే కంగనా మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ స్ట్రీట్ ఫుడ్స్ తినేదాన్ని కాదు. ఈ సినిమా పుణ్యమా అని అవి కూడా అలవాటైపోయాయి. కాన్పూర్‌లో ‘తుండే కబాబ్స్’ బాగా ఫేమస్. నేను శాకాహారిని కాబట్టి అవేమీ తినడానికి లేదు. అందుకని చాట్ తిన్నా. అప్పట్నుంచీ స్ట్రీట్ ఫుడ్‌కు బానిసైపోయా. సాయంత్రం అయ్యేసరికి మేం వెళ్లడమో లేక చాట్ పార్శిల్ తెప్పించుకుని తినడమో జరిగేది. లక్నోలోని ‘శుక్లా చాట్ హౌస్’ చాట్‌కు ఫిదా అయిపోయా’ అని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more