రెమ్యునరేషన్ విషయంలో హీరోల కంటే హీరోయిన్లే ఒకప్పుడు చాలా కష్టాలు ఎదుర్కునేవారు. టైంకి సినిమా పూర్తవ్వటంలో తమ వంతు కృషిగా రేయింబవళు కష్టపడ్డప్పటికీ హీరో డామినేషన్ ఓవైపు, మరివైపు పారితోషక విషయంలో మాత్రం అసంతృప్తే మిగిలేదని సీనియర్ నటీమణులు ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో చెప్పటం చూస్తుంటాం. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మచ్చుకైనా కనిపించదు.
ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చేసుకుని ఆపై టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు కొందరు బ్యూటీలు. ఎవరి సంగతి ఏమోగానీ ప్రస్తుతం ఓ చిన్న హీరోయిన్ గురించి మాత్రం టాలీవుడ్ లో తెగ డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణం విపరీతంగా ఆవిడగారు సంపాదించేయటమే. ఓ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన సదరు హీరోయిన్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 5 నుంచి 10 లక్షలు. కానీ, సుమారు రెండున్నర కోట్లు విలువైన విల్లాను కొనుగోలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
అయితే దీని వెనుక రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొంత కాలం రియల్ ఎస్టేట్ లో తాను చేసిన ఇన్వెస్ట్ మెంట్ ఇందుకు కారణమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఏ మాత్రం రియల్ బూమ్ లేని టైంలో సాధ్యమయ్యే పనికాదన్నది ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇతర వ్యవహారాలతోనే ఇంతలా సంపాదించిందన్న మరో టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఆ ఇతరాలు ఏంటో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more