‘గబ్బర్ సింగ్’తో మరోసారి పవర్ స్టార్ | Pawan kalyan once again with Gabbar singh

Pawan kalyan once again with gabbar singh

Pawan kalyan once again with Gabbar singh, Pawan kalyan with Gabbar singh, Pawan kalyan upcoming films, Pawan kalyan films updates, Pawan kalyan movie news, Pawan kalyan stills, Pawan kalyan husharu, Pawan kalyan new look, Pawan kalyan

Pawan kalyan once again with Gabbar singh: Powerstar Pawan kalyan block buster film Gabbar singh. Pawan kalyan gives green signal to director harish shankar.

‘గబ్బర్ సింగ్’తో మరోసారి పవర్ స్టార్

Posted: 05/25/2016 12:35 PM IST
Pawan kalyan once again with gabbar singh

ఒకప్పుడు ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషీ’ చిత్రాలు పవన్ కళ్యాణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత దాదాపు చాలా ఫ్లాపుల తర్వాత మళ్లీ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త తారాస్థాయికి చేరుకుంది. పవర్ స్టార్ స్టామినాను ఆకాశానికి పెంచేసింది. ‘గబ్బర్ సింగ్’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా కలెక్షన్ల మోత మోగించేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ కు ‘గబ్బర్ సింగ్’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో.. అసలే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్... ‘గబ్బర్ సింగ్’ సినిమాను అద్భుతంగా రూపొందించాడు. పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకు మించిన రేంజులో ‘గబ్బర్ సింగ్’ను తీర్చిదిద్ది.. తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఆ తర్వాత తాజాగా మరోసారి పవర్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే హరీష్ శంకర్ ఓ పవర్ ఫుల్, స్టైలిష్ స్టోరీలైన్ తో పవన్ కళ్యాణ్ ను సంప్రదించి, కథ వినిపించాడట. ఆ కథ పవన్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట హరీష్ శంకర్. ఎందుకంటే అసలే పవన్ కళ్యాణ్ త్వరగా సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

అందుకే తను అనుకున్న కథను త్వరగా, పర్ఫెక్ట్ గా పూర్తిచేసుకుని సినిమా స్టార్ట్ చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎ.ఎం.రత్నంతో ఓ సినిమా చేయడానికి పవన్ ఇటీవలే మాటిచ్చాడని తెలిసిందే. అందుకే పవన్-హరీష్ శంకర్-ఎ.ఎం.రత్నం కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సినీవర్గాల సమాచారం. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. అనూప్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా అన్ని వివరాలను తెలియజేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Harish Shankar  Husharu  Shruti Haasan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more