puri jagannadh out from chiranjeevi 150th movie | tollywood gossips | telugu movie rumours

Puri jagannadh out from chiranjeevi 150th movie tollywood gossips

puri jagannadh, chiranjeevi, tollywood gossips, chiru 150 film news, chiru 150 film gossips, chiru latest movie updates, chiru 150 movie updates, chiranjeevi gossips, puri chiru movie updates, director vv vinayak, vv vinayak news, chiranjeevi parlour

puri jagannadh out from chiranjeevi 150th movie tollywood gossips : According to filmnagar news puri jagannadh out from chiranjeevi's 150 flick. Chiru is now not happy with Puri Jagannadh as he announced multiple projects before the start of a big film.

షాకింగ్ న్యూస్ : చిరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న పూరీ

Posted: 06/13/2015 01:20 PM IST
Puri jagannadh out from chiranjeevi 150th movie tollywood gossips

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎదురుచూసిన అభిమానులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే ఓ స్వీట్ న్యూస్ ఇచ్చిన విషయం తెలిసిందే! పూరీ తాను తయారుచేసిన స్ర్కిప్ట్ ని చిరుకు వివరించగా.. అందుకు ఆయన ఆకర్షితుడైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తాను చిరు 150వ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లుగా పూరీ పేర్కొన్నాడు. ఇక ఇతనితోపాటు ఈ చిత్రాన్ని నిర్మించనున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా తన తండ్రి 150వ చిత్రాన్ని పూరీయే డైరెక్ట్ చేయనున్నట్లుగా స్పష్టం చేసిన వ్యవహారం తెలిసిందే!

ఇలా అందరూ చిరు 150వ చిత్రంపై స్పందించిన అనంతరం ఎవరి పనుల్లో వారు ఫుల్ బిజీ అయిపోయారు. ఓవైపు చిరంజీవి ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా స్టైలిష్ గా తయారవ్వడంలో, స్ర్కిప్ట్-ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పూరీ - చెర్రీ ఇద్దరూ మునిగిపోయారు. ఈ చిత్రాన్ని 22వ తేదీన లాంఛనంగా ప్రారంభించి.. సెప్టెంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్లాన్ కూడా చేసుకున్నారు. అయితే.. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. చిరు 150వ మూవీ ప్రాజెక్ట్ నుంచి పూరీ తప్పుకున్నట్లు ఫిలింనగర్ లో పుకార్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విధంగా ఈ పుకార్లు రావడంపై కొన్ని బలమైన కారణాలూ వున్నాయి.

ఇటీవలే దర్శకుడు పూరీ చాలా ప్రాజెక్టులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే! మొదట నితిన్ అనుకున్న సినిమా క్యాన్సిల్ అయి వరుణ్ తో ఫిక్స్ అవడం, ఆ తర్వాత మహేష్ బాబు కోసం ఇప్పటికే స్టోరీ రెడీగా వుందని చెప్పడం, వీటికితోడు ఇతరులతో పూరీ మంతనాలు జరపడం వంటి విషయాలతో చిరంజీవి సంతోషంగా లేరని తెలుస్తోంది. తన ప్రాజెక్ట్ పై పూరీ పూర్తి శ్రద్ధ చూపించడం లేదన్న అభిప్రాయాన్ని చిరు వెల్లడించినట్లు తెలుస్తోంది. చాలాకాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న తన 150వ ప్రాజెక్ట్ ను పూరీ సమర్థవంతంగా తెరకెక్కించలేడన్న అనుమానాన్ని ఆయన తన సన్నిహితులతో వ్యక్తం చేశారట! తన చిత్రంపై కాకుండా ఇతర మూవీలపై పూరీ ఆసక్తి చూపడం చిరుని కాస్త ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇంకొక సంచలన వార్త ఏమిటంటే.. ఈ గురువారం చిరంజీవి దర్శకుడు వివి వినాయక్ ని కలిశారని, దాదాపు ఒక గంటపాటు మంతనాలు జరిపారని సమాచారం! బహుశా చిరు తన 150వ చిత్రం గురించి చర్చించుకోవడం కోసమే వినాయక్ ఇంటికి వెళ్లారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటిని గమనిస్తుంటే.. పూరీతో తన 150వ చిత్రం చేయడానికి చిరు అంతగా ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి.. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jagannadh  chiranjeevi  chiru 150 film  vv vinayak  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more