jyothika | 36 vayadhinile dubbing

36 vayadhinile dubbing into telugu

36 vayadhinile dubbing into telugu, 36 vayadhinile movie news, 36 vayadhinile movie stills, 36 vayadhinile collections, 36 vayadhinile songs, 36 vayadhinile trailers, jyothika latest news, jyothika movie news, jyothika

36 vayadhinile dubbing into telugu: Actress jyothika latest tamil movie 36 vayadhinile. this movie will be dubbing into telugu.

జ్యోతిక 36వయసుతో తెలుగులోకి రీఎంట్రీ

Posted: 05/21/2015 03:45 PM IST
36 vayadhinile dubbing into telugu

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జ్యోతిక దాదాపు తొమ్మిది ఏళ్ల తర్వాత ఇటీవలే ‘36 వయాధినిలే’ చిత్రం ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ తో కొనసాగుతోంది. హౌస్ ఫుల్ షోలతో మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ స్టార్ హీరో సూర్య స్వయంగా నిర్మించాడు.

అయితే సూర్య, జ్యోతికలు నటించిన చాలా చిత్రాలు ఇప్పటికే తెలుగులోకి డబ్బింగ్ అయ్యి, విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ‘36 వయాధినిలే’ చిత్రాన్ని కూడా తెలుగులోకి డబ్బింగ్ చేయాలనే ఆలోచనలో సూర్య వున్నాడట. జ్యోతికకు కూడా తెలుగులో అభిమానులున్నారు.

‘చంద్రముఖి’, ‘ఠాగూర్’, ‘మాస్’ వంటి పలు చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది జ్యోతిక. కాబట్టి ‘36 వయాధినిలే’ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే, తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నాడు సూర్య. త్వరలోనే తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

ప్రస్తుతం సూర్య హీరోగా నటించిన ‘మాస్’ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో మే 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jyothika  36 vayadhinile  dubbing  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more