Rajamouli denies hollywood movie plan

rajamouli denies hollywood movie plan, rajamouli busy in bahubali movie, rajamouli movie with ranbir kapoor and jet lee

rajamouli denies hollywood movie plan

లేని (నీలి) వార్తల పుట్టుకను ప్రశ్నించిన రాజమౌళి

Posted: 07/14/2014 11:50 AM IST
Rajamouli denies hollywood movie plan

ఒకసారి ఒకే పనిలో నిమగ్నమై దానికి తన పూర్తి శక్తియుక్తులను సృజనాత్మకతను అంకితమిచ్చే దర్శకుడు రాజమౌళి లేని వార్తలు ప్రచారంలోకి రావటాన్నిచూసి అసలు అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు.  

ఆకలి లేకపోయినా మసాలా ఘుమఘుమలతో ఆకర్షించి తినేట్టుగా చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలాగా వార్తలలో మసాలా దట్టించి వాటిని చదివి ఆస్వాదించేట్టుగా చేసే వార్తాహరులు కొందరు రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ గురించి వాళ్ళ బుర్రల్లో తళుక్కుమన్న ఆలోచనను నిజమైన వార్తలాగానే చెప్పేసారు.  అదేమీ ఎవరినీ కించపరచేది, ఎవరికీ నష్టపరచేదీ కాదనుకోండి కానీ రాజమౌళి దాని మీద కూడా స్పందించారు.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే రణబీర్ కపూర్, జెట్ లీ లతో రాజమౌళి హాలివుడ్ సినిమానోదాన్ని ప్లాన్ చేస్తున్నారని ఒక ఇంగ్లీష్ పత్రిక కథనం.  హాలీవుడ్ సినిమా తియ్యటం అంత సులువా, టికెట్ కొని ఫ్లైట్ ఎక్కినంత సులభమా ఏమిటి అన్న రాజమౌళి ఎలా పుట్టుకొస్సాయీ వార్తలు అంటూ ట్వీట్ చేసారు.  తానేం చెయ్యదలచుకున్నా ముందు చెప్పే చేస్తాను కాబట్టి ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని కూడా ఆయన చెప్పారు.

ప్రస్తుతం బాహుబలి సినిమా నిర్మాణం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న రాజమౌళి అది పూర్తి కాకుండానే మరో పెద్ద ప్రాజెక్ట్ కి ప్రణాళికలను సిద్ధం చేస్తారని ఎలా అనుకున్నారసలు?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more