Five kisses per day inidcates good relationship

husband and wife relationship, relationship survey, kiss, romance, sex in week, family, perfect relationship, good husband, good wife

five kisses per day, one romantic meal per month, i love you before sleep tells good relationship : survey on husband wife relationship

వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే చాలు

Posted: 08/11/2014 03:21 PM IST
Five kisses per day inidcates good relationship

భార్య, భర్తల అనుబంధాన్ని వర్ణించటానికి ప్రపంచంలో ఎన్నో మాటలున్నాయి. అయితే ఆ బంధాన్ని మరింత దృడం చేయటానికి మాత్రం ఖచ్చితమైన విధానాలు అంటూ ఏవి లేవు. వ్యక్తులను బట్టి మెలుగుతూ ఉంటే దాంపత్య బంధం బలపడుతుందని చెప్తారంతా. అయితే అదంతా ఒకప్పటి మాట... ఇప్పుడు దంపతుల అన్యోన్యతను పెంచటానికి కొలమానాలు తీసుకువచ్చిందో సంస్థ. దాంపత్య జీవితంపై చాలా ప్రభావం చూపే అంశాలపై సర్వే నిర్వహించి మరీ నిజాలను వెలికితీస్తున్నామని చెప్తోంది. ఎన్నికల్ల పార్టీ విజయాన్ని చెప్పే సర్వేలు, కుటుంబ బంధాలను కూడా చెప్తాయా అంటే అవునని అంటున్నారు వీళ్ళు.
    
సర్వే ప్రకారం రోజుకు ఐదు భాగస్వామికి ఐదు సార్లు ముద్దులిస్తే అది వారి అన్యోన్యతను తెలియజేస్తుందంటున్నారు. అంతేకాదు భర్త, బార్య మద్య మూడున్నరేళ్ళ వయస్సు తేడా ఉంటే అది సరైన జోడి అట. ఇక నెలకోసారి బయటి బోజనం, నెలకొసారి సరదాగా బయటకు ప్రయాణం దాంపత్య బందాన్ని దృడం చేస్తాయని చెప్తున్నారు. వీటితో పాటు ఇద్దరి మద్య వివాదం, తగువులు తీరిన తర్వాత ఒకరిపై మరొకరు చెప్పుకునే తప్పుల చాడీలు, కుటుంబ సమస్యలను కలిసి చర్చించుకోవటం ఈ సంబంధాన్ని మరింత పెంచుతాయని ఢంకాపధంగా చెప్తున్నారు.

వారానికి రెండు సార్లు సెక్స్!

రోజుకు ఐదు ముద్దులతో పాటు వారానికి రెండుసార్లు సెక్స్ చేయటం వల్ల ఈ బంధం మరింత బలపడుతుందన్నారు. అంతకంటే ఎక్కువ సార్లు అంటే అది మన ఇష్టం కానీ.., కనీసం మూడు రోజులకోసారి తప్పనిసరి అని సూచిస్తున్నారు. లేకపోతే భాగస్వామిపై వ్యతిరేకత పెరటానికి ఇదే పునాది వేస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక పడుకునే ముందు తప్పనిసరిగా ఐ లవ్ యూ అని చెప్పాలట. ఇలా చెప్తే సుఖంగా నిద్ర పోవటంతో పాటు, తరువాతి ఉదయం కూడా చికాకు లేకుండా ఉంటారట దంపతులు. ఐ లవ్ యూ అనే పదాన్ని ఓ హాబిలా చేసుకున్నా తప్పు లేదంటున్నారు సర్వే విశ్లేషకులు.

ఇదండీ ఇలా చిన్న చిన్న అంశాలను తీసుకుని సర్వే చేసి గొప్ప విషయాలే వెల్లడించారు.  పండంటి కాపురానికి వీరు ఇరవై సూత్రాలు ప్రతిపాదించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

1. గొడవ తర్వాత తప్పు చేశానని ఒప్పుకోవటం

2.పడుకునే ముందు ఐ లవ్ యూ చెప్పటం,

3 ఇంటి అవసరాలు, పనులను చర్చించుకోవటం,

4 దైనందిన కార్యక్రమాలను పూర్తి చేసుకోవటం,

5 వంటలో సహాయపడటం,

6 వారానికి రెండు సార్లు సెక్స్,

7 బట్టలు ఉతకటంలో సహాయం,

8 ఇద్దరూ ఒకే రకమైన సినిమాలు ఇష్టపడటం, చూడటం,

9 కామన్ ఫ్రెండ్స్ ను కలవటం,

10 మూడేళ్ళు, ఆరు నెలల వయస్సు గ్యాప్,

11 అభిప్రాయాలను పంచుకోవటం,

12 నెలకు మూడు రాత్రులు బయటకు వెళ్ళటం,

13 స్నేహితుల గురించి చర్చించటం,

14 మంచి స్నేహితులుగా ఉండటం,

15 రోజకు ఐదు ముద్దులు,

16 రోజుకు ఐదు సార్లు కౌగిలించుకోవటం,

17 సంవత్సరంలో రెండు వారాలు బయటకు వెళ్ళటం,

18 ఇద్దరూ ఫుల టైం జాబ్ చేయటం,

19 ఒకే రకమైన ఫుడ్ టేస్ట్ ఉండటం.

ఇవండీ సుఖ దాంపత్య జీవనానికి సర్వే సూచనలు. ఇవి ఎంత వరకు నిజమో, ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలియదు కానీ.., సుఖ సంసారం కోసం ఓ సారి పాటించి చూద్దాం ఆ తర్వాత ఎలాగు అలవాటవుతుంది.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  family relationship  kiss  sex  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more