ABCD Movie Review Rating Story Cast and Crew ‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘ఏబీసీడీ’ ‘ఏబీసీడీ’ Get information about ABCD Telugu Movie Review, Allu shirish ABCD Movie Review, ABCD Movie Review and Rating, ABCD Review, ABCD Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 90560 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘ఏబీసీడీ’

  • బ్యానర్  :

    మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌

  • దర్శకుడు  :

    సంజీవ్‌ రెడ్డి

  • నిర్మాత  :

    మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని

  • సంగీతం  :

    జుదా సాందీ

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    రామ్‌

  • ఎడిటర్  :

    న‌వీన్ నూలి

  • నటినటులు  :

    అల్లు శిరీష్‌, రుక్సార్ ధిల్లన్‌‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు, రాజా, కోట శ్రీనివాస‌రావు, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల‌ కిషోర్ త‌దితరులు

Abcd Movie Review

విడుదల తేది :

2019-05-17

Cinema Story

రెండేళ్ల కింత ఓ సంపన్నుడైన తండ్రి తన కొడుక్కు జీవితం, డబ్బు, మనుషుల విలువ తెలిసేందుకు తన పేరు, పరపతి ఉపయోగించకుండా నెల రోజుల పాటు బతకాలని కట్టుబట్టలతో పంపించిన రియల్ స్టోరీనే తీసుకుని తెరపై కథ మలిచాడు దర్శకుడు. అర‌వింద ప్ర‌సాద్‌(అల్లు శిరీష్‌) న్యూయార్క్‌లో సెటిల్‌ అయిన మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి సరదాగా లైఫ్‌ గడిపేస్తుంటాడు అవి. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్‌ వెకేషన్‌ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. ఇండియా వ‌చ్చిన అర‌వింద్ అలియాస్ అవి ఖ‌ర్చుల‌కు తండ్రి డ‌బ్బులు కేవ‌లం ఐదు వేల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాడు.

అప్పుడు అవిని, భాషాని ఎంబీఏ కాలేజ్‌లో జాయిన్ చేయిస్తాడు నాగబాబు. అక్క‌డ అవికి నేహ‌(రుక్స‌ర్ థిల్లాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. అయితే ఓ సంద‌ర్భంలో అవి రోజుకి 83 రూపాయ‌లు మాత్ర‌మే ఖర్చు పెడుతున్నాడ‌నే విష‌యం మీడియాకి తెలిసిపోయి పాపుల‌ర్ అయిపోతాడు. ఈ క్రమంలో లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? స్నేహితుడు బాషాతో ఒక బ‌స్తీలో ఎలా జీవితాన్ని గ‌డిపాడు? అత‌నికి డ‌బ్బు విలువ ఎలా ఎప్పుడు తెలిసింది? ఈ ప్రయాణంలో నేహాతో అవికి ఎలా అనుబంధం పెరిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

cinima-reviews
‘ఏబీసీడీ’

విశ్లేషణ

డ‌బ్బంటే లెక్క లేని కుర్రాడికి చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేని ప‌రిస్థితులు వ‌స్తే? డాల‌ర్ల కొద్దీ ఖ‌ర్చు పెడుతూ జల్సాలు చేసిన  కుర్రాడు.. ప్రతి పైసాని లెక్క పెట్టుకుంటూ నెట్టుకురావాల్సి వ‌స్తే?.. ఇలా ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తూ క‌థ చెప్పడానికి క‌డుపుబ్బా న‌వ్వించ‌డానికి త‌గిన వేదికే ఈ క‌థ. కొంత‌కాలం కింద‌ట వ‌చ్చిన ‘పిల్ల జ‌మిందార్’ సినిమాలో ఇలాంటి సంద‌ర్భాల్నే ఉప‌యోగించుకుంటూ చ‌క్కటి వినోదం పండించారు. కానీ, ఇక్కడ మాత్రం చిత్రబృందం విఫ‌ల‌య‌త్నం చేసింది. ఎత్తుగ‌డ బాగున్నా... ఆ త‌ర్వాత స‌న్నివేశాల్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దలేక‌పోయారు. అక్కడ‌క్కడా కాసిన్ని న‌వ్వులు పండాయి త‌ప్ప హాస్యం ప‌రంగా కూడా పెద్దగా  ప్రభావం చూపించ‌లేక‌పోయింది ఈ చిత్రం.

అమెరికా జ‌ల్సా జీవితాన్ని కానీ... ఇండియాకి వ‌చ్చాక డ‌బ్బు లేక క‌థానాయ‌కుడు ప‌డే పాట్లని కానీ స‌హ‌జంగా తీర్చిదిద్దలేక‌పోయారు ద‌ర్శకుడు. దాంతో క‌థ‌తో ప్రేక్షకుడు ఏ ద‌శ‌లోనూ క‌నెక్ట్ అవ్వడు. స‌న్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టే అనిపిస్తుంది త‌ప్ప సినిమాలో ఎలాంటి వినోదం పండ‌దు. స‌బ్ ప్లాట్ గా పొలిటిక‌ల్ డ్రామా కూడా ఉంటుంది. దాన్ని అస‌లు క‌థ‌కి మేళ‌వించిన విధానం కూడా అత‌క‌లేదు. రోజుకి రూ.82 రూపాయ‌ల‌తో బ‌తుకుతున్నాన‌ని క‌థానాయ‌కుడు చెబుతుంటాడు కానీ.. అత‌ని లుక్ కానీ, గ‌డిపే జీవితం కానీ అలా ఉండ‌దు. హీరోహీరోయిన్ల మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాల్లోనూ స‌హ‌జ‌త్వం లేదు. ఇక‌పై మ‌నం ఫ్రెండ్స్ అంటారు, ఆ వెంట‌నే క‌థానాయిక‌ని చూసి క‌న్ను కొట్టేస్తాడు హీరో.

ప్రతినాయ‌కుడు దుబాయ్ లో ప‌వ‌ర్‌ ఫ్యాక్టరీలు న‌డుపుతూ వేల కోట్లు సంపాదిస్తుంటాడు కానీ అత‌ను ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే కాలేజీ విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నట్టుగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. మొత్తంగా చూస్తే మాతృక‌ని అర్థం చేసుకొన్న విధానమే స‌రిగ్గా లేదేమో అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌. యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందిన ఓ వీడియో స్ఫూర్తితో తెర‌కెక్కించిన ఆ స‌న్నివేశాలు బాగా న‌వ్విస్తాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

క‌థానాయ‌కుడు అల్లు శిరీష్  త‌న పాత్రలో ఒదిగిపోయే ప్రయ‌త్నం చేశాడు. ఆయ‌న‌కి స్నేహితుడిగా భ‌ర‌త్ న‌టించాడు. ఇద్దరూ క‌లిసి చేసిన సంద‌డి అక్కడక్కడా న‌వ్విస్తుంది. క‌థానాయిక రుక్సార్ ధిల్లన్ అందంగా క‌నిపించింది త‌ప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యంలేదు. ప్రతినాయ‌కుడిగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా న‌టించారు. యువ రాజ‌కీయనాయ‌కుడి పాత్రలో ఆయ‌న క‌నిపించిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ పాత్ర ప‌రిమిత‌మే అయినా బాగా న‌వ్వించారు. నాగ‌బాబు త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

ఇక్కడ మొదట చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించే. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రానికి మార్పులు చేసిన నేటివీటికీ తగ్గట్టుగా రీమేక్ చేసినా.. కథనం మాత్రం అతికించినట్లు కనబడుతోంది. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు ఏమాత్రం స‌రిపోలేదు. క‌థ విష‌యంలో ప‌లువురు ద‌ర్శకుల స‌ల‌హాలు తీసుకున్నా ఆ ప్రభావం సినిమాపై పెద్దగా క‌నిపించ‌లేదు. అయితే సాంకేతిక పరంగా మాత్రం సినిమా బాగుండి. సినిమా స్థాయికి త‌గ్గట్టే నిర్మాణ విలువ‌లు ఉన్నాయి. కన్నడ సంగీత దర్శకుడు జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ఇక సిద్ శ్రీ రామ్ పాడిన ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. రామ్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌ లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు సినిమాటోగ్రాఫర్ రామ్‌.

తీర్పు..

బ్రేక్ కోసం తపిస్తున్న శిరీష్ ఈ సినిమాలో అతికినట్టు ఉండే ప్రయత్నాలకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో వేచిచూడాలి.

చివరగా... కామెడీ ఇంకాస్త పండిస్తే సూపర్ హిట్టే..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh