Goodachari best spy films in Tollywood ‘గూఢచారి’ అద్భుత స్పై చిత్రం

Teluguwishesh ‘గూఢచారి’ మూవీ రివ్యూ ‘గూఢచారి’ మూవీ రివ్యూ Goodachari is one new age spy thriller that the Tollywood audience haven't witnessed in the recent years. Adivi Sesh and his team should be widely appreciated for their efforts and Goodachari makes a decent watch. Product #: 88341 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘గూఢచారి’

  • బ్యానర్  :

    అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్

  • దర్శకుడు  :

    శ‌శి కిర‌ణ్ తిక్క‌

  • నిర్మాత  :

    అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్

  • సంగీతం  :

    శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    శ‌నీల్ డియో

  • ఎడిటర్  :

    గారి బి.హెచ్‌

  • నటినటులు  :

    అడివి శేష్‌, శోభితా దూళిపాళ‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్ రాజ్‌, మ‌ధుశాలిని, అనీష్ కురివెల్ల‌, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు

Goodachari Moive Review

విడుదల తేది :

2018-08-03

Cinema Story

ఇండియ‌న్ ‘రా’ విభాగంలో ప‌నిచేసే స‌త్య‌(ప్ర‌కాశ్‌రాజ్‌) దేశం కోసం ఓ ఆప‌రేష‌న్ చేస్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థుల కాల్పుల్లో స‌త్య స్నేహితుడు ర‌ఘువీర్ చ‌నిపోతాడు. ర‌ఘువీర్ కొడుకు గోపి(అడివి శేష్‌)ని సంర‌క్షించే బాధ్య‌త‌ను స‌త్య తీసుకుని అత‌డి పేరుని అర్జున్‌గా మార్చేస్తాడు. ఉద్యోగం మానేసి ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా అజ్ఞాతంలో ఉంటారు. పెరిగి పెద్ద‌యిన అర్జున్ దేశం కోసం ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న‌తో తండ్రిని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని ‘రా’ విభాగం కోసం అప్లై చేస్తాడు. 174 సార్లు అప్లై చేసిన త‌ర్వాత 175వ సారి ‘రా’ విభాగంలోకి అర్జున్ సెల‌క్ట్ అవుతాడు.

దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దులు దాటి ప‌నిచేసే ‘రా’ లో త్రినేత్ర విభాగంలో అర్జున్ జాయిన్ అవుతాడు. అదే స‌మ‌యంలో సైకాల‌జిస్ట్ స‌మీర(శోభితా దూళిపాళ‌)తో ఏర్ప‌డ్డ పరిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అయితే టెర్ర‌రిస్టు నాయ‌కుడు రాణా ఓ ప్లాన్ వేసి ‘రా’ విభాగానికి చెందిన పెద్ద ఆఫీస‌ర్స్‌ను చంపేసి ఆ నేరం అర్జున్‌పై మోపుతాడు. త‌నపై ప‌డ్డ నింద‌ను అర్జున్ ఎలా తొల‌గించుకున్నాడు. ఈ క్ర‌మంలో దేశం కోసం అర్జున్ ఏం చేశాడు. ఈ ప్ర‌యాణంలో అర్జున్‌కి తెలిసిన నిజాలేంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

cinima-reviews
‘గూఢచారి’ మూవీ రివ్యూ

విశ్లేషణ

విదేశాల్లో శత్రువులను కాచుకోవడంలో రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), దేశం లోపల ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కీలక పాత్ర పోషిస్తాయి. దేశ, విదేశాల్లో ఎక్కడైనా పని చేయగలిగేలా.. ఈ రెండు విభాగాల నుంచి మెరికల్లాంటి యువకులతో ‘త్రినేత్ర’ను ఏర్పాటు చేస్తారు. ఈ టీంకు అర్జున్ ఎంపికవుతాడు. అతణ్ని ఎంపిక చేసే తీరు, శిక్షణలో ఎలాంటి అంశాలు నేర్పుతారో ఫస్టాఫ్‌లో చాలా బాగా చూపించారు. గూఢచారుల శిక్షణ ఎలా ఉంటుందనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

అర్జున్ ‘రా’లో చేరి శిక్షణ పొందడం, సమీరా రావు (శోభిత ధూళ్లిపాల)తో ప్రేమలో పడటం.. ఇలా ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అర్జున్ టీంలోని కీలక వ్యక్తులను, తన ప్రియురాలు సమీరాను ఉగ్రవాదులు హతమారుస్తారు. నేరం మాత్రం అర్జున్ మీదకు వస్తుంది. దీంతో ఇంటర్వెల్ ముందు కథ కీలక మలుపు తిరుగుతుంది. సమీరా ఖాన్.. సమీరా రావుగా పేరు మార్చుకొని తన జీవితంలోకి ఎందుకొచ్చిందో తెలుసుకున్న హీరో.. చిన్న క్లూ ఆధారంగా శత్రువులను వెతుక్కుంటూ బంగ్లాదేశ్ వెళ్తాడు. అక్కడ వచ్చే యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది.

అక్కడే తన తండ్రి బతికే ఉన్నాడని అర్జున్‌కి తెలుస్తుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించినట్టు అనిపించినా.. ప్రీ క్లైమాక్స్ ట్విస్టుతో మళ్లీ సినిమా ఓ రేంజ్‌కు వెళ్తుంది. క్లై మాక్స్‌లో ప్రకాష్, జగపతి బాబు, అడివి శేష్ మధ్య వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ‘త్రినేత్ర’ పేరిట దేశ రక్షణ కోసం సామాన్య ప్రజానీకంలో కలిసిపోయి ఇంటెలిజెన్స్ అధికారులు ఎలా పని చేస్తారో, నిత్యం దేశాన్ని డేగ కన్నుతో ఎలా పహారా కాస్తారో బాగా చూపించారు. ట్విస్టులు కోరుకునే వారికి, థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ పండగ లాంటిది.

నటీనటుల విషానికి వస్తే

గుఢాచారి టైటిల్ తో సినిమా రూపొందుతోందంటే క‌చ్చితంగా సినిమాపై అంచ‌నాలు ఉంటాయ‌న‌డంలో ఏ సందేహం లేదు. సినిమా ఆ అంచ‌నాల‌కు ధీటుగా ఉండాలి. అడివి శేష్, శ‌శికిర‌ణ్ తిక్క అండ్ టీం ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్ష‌కుల‌కు క‌ట్టి పడేశారు. గూఢచారిగా అర్జున్ అలియాస్ గోపీ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు అతడే ప్రధాన బలం. అర్జున్‌ను పెంచిన తండ్రి పాత్రలో, దేశ రక్షణ కోసం ఆరాటపడే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నటన బాగుంది.

త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను క్లియ‌ర్ చేసుకునే సంద‌ర్భంలో స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయ‌డం.. వాటిని డీ కోడ్ చేస్తూ ముందుకెళ్ల‌డం అన్నీ సూప‌ర్బ్ గా ఉన్నాయి. ఇక జగ‌పతిబాబు పాత్ర‌ను రివీల్ చేసిన తీరు.. ఆ పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. హీరో తండ్రిగా జగపతి బాబు పాత్ర ఈ సినిమాలో కీలకం. సమీరా రావుగా శోభిత పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. ఐబీ ఆఫీసర్‌గా వెన్నెల కిశోర్ హాస్యం పంచారు. త్రినేత్ర ఆఫీసర్‌గా సుప్రియ కీలక పాత్రలో కనిపించారు.

శోభితా దూళిపాళ పాత్ర ఫ‌స్టాఫ్‌కే ప‌రిమిత‌మైనా చ‌క్క‌గా ఉంది. 22 ఏళ్ల త‌ర్వాత న‌టించిన సుప్రియ యార్ల‌గ‌డ్డ మంచి పాత్ర‌లో న‌టించారు. అనీశ్ కూడా మంచి పాత్ర చేశారు. వెన్నెల‌కిశోర్ పాత్ర పంచ్‌ల‌తో కామెడీ పుట్టించే ప్ర‌య‌త్నం బావుంది. ముఖ్యంగా క‌థ‌లో ట్విస్టులు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ఇలా అన్నీ.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుంటాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కే సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలం. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, అలాగే శ‌నీల్ డియో కెమెరా వర్క్‌తో ప్ర‌తి స‌న్నివేశం చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. క‌థ‌, స్క్రీన్‌ప్లేలో భాగం అవ‌డ‌మే కాకుండా.. హీరోగా న‌టించిన తీరు మెప్పిస్తుంది.

తీర్పు..

దేశ రక్షణ, స్పై, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సర్ ప్రైజ్ లు కోరుకునే వారికి, ట్విస్టులను ఇష్టపడే వారిని ‘గూఢచారి’ మంచి విందుబోజనం లాంటి సినిమా అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అడివి శేష్ మార్క్ సినిమా. సో డోంట్ మిస్ ఇట్.

చివరగా... ప్రేక్షకులను కట్టిపడేసిన అద్భుత స్పై చిత్రం..

 

 

 

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh