CISF puts Kareena Kapoor through security protocol at airport ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

kareena kapoor, saif ali khan, Foreign tour, Mumbai Airport, Passport, CiSF security Check, Bollywood, movies, Entertainment

Kareena Kapoor and Saif Ali Khan, along with their children Taimur and Jeh, and their entourage of nannies, were put through the security protocol at the Mumbai airport by the CISF personnel. Before disappearing inside the gates, Kareena and Saif paused and posed for the paparazzi.

ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

Posted: 09/16/2021 07:42 PM IST
Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ను సైతం సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటి అధికారి అడ్డుకుని పాస్‌పోర్ట్‌ అడిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా, కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్‌తో కలిసి ఆమె ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అక్కడ సైఫ్, తైమూర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే జహంగీర్‌ కేర్‌ టేకర్‌, కరీనాలు వారి వెనకాలే ఉన్నారు. అక్కడ ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ ఆఫిసర్లు కేర్‌ టేకర్‌ను అడ్డుకుని పాస్‌పార్ట్‌ అడిగారు. వారితో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన కరీనాను సైతం వారు పాస్‌పోర్ట్‌ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్‌ చేస్తుండగా తన వెనకాలే ఉన్న వారి మేనేజర్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిన సైఫ్ వెనక్కు వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇది​ చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడకుండా తమ బాధ్యతను నిర్వర్తించిన సదరు సెక్యూరిటీ ఆఫీసర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles