ఎన్నికలవేళ దివంగత ఎన్‌టీఆర్ మీద సినిమాలు చేస్తూ ఎవరికి అనుకూలంగా వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవగా.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమాను తీస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంటి గడప తొక్కుతుండగా.. గద్ద పైనుండి వెళ్లడం.. ఆ సమయంలో తెలుగింటి గడపపై విరజిమ్మిన 'విషం' అనే క్యాప్షన్ రాశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
టీజర్ విడుదల సంధర్భంగా.. ఎన్‌టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన ఘటలను చిత్రీకరిస్తున్నామని కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ తుది దశలో ఎదుర్కొన్న అత్యంత అవమానకరమైన, కీలకమైన సన్నివేశాలను సినిమాగా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఎవరినీ ఉదేశించి తీయట్లేదని, ఏప్రిల్ తొలి వారంలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిగా శ్రీ రెడ్డి నటిస్తున్నట్టు తెలుస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీ పార్వతికి సంబంధించిన పాజిటివ్ అంశాలని వర్మ చూపించే ప్రయత్నం చేస్తుండగా, ఈ సినిమాలో నెగెటివ్ అంశాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చూపించనున్నట్లు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more