himanshi to play Purandeswari role in NTR biopic ఎన్టీఆర్ తనయ పురందేశ్వరిగా బెజవాడ డాన్సర్

Himanshi to play purandeswari role in ntr biopic

ntr biopic, Purandeswari, Himanshi, Chandrababu, hero rana, ANR, sumanth, balakrishna, kollywood, movies, entertainment

A young classical dancer Himanshi to play purandeswari role in NTR biopic, the first look has gone viral on net.

ఎన్టీఆర్ తనయ పురందేశ్వరిగా బెజవాడ డాన్సర్

Posted: 09/22/2018 12:29 PM IST
Himanshi to play purandeswari role in ntr biopic

‘యన్టీఆర్‌’ సినిమాలోని పాత్రలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబునాయుడిగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌.. తదితర పాత్రల గురించి అధికారికంగా వెల్లడించారు. అయితే ఇందులో యన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిగా ఎవరు కనిపించనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కారణి హిమన్సీ ఈ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారట.

అంతేకాదు పురందేశ్వరి గెటప్‌లో హిమన్సీ ఉన్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పురందేశ్వరి ఆమె పక్కన నిల్చుని నవ్వుతూ కనిపించారు. హిమన్సీ ఈ పాత్రకు చక్కగా సరిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

‘యన్టీఆర్‌’లో నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. ఇటీవల ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పోషిస్తున్న సుమంత్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఏయన్నార్‌లా సుమంత్‌ చక్కగా సరిపోయారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr biopic  Purandeswari  Himanshi  Chandrababu  hero rana  ANR  sumanth  balakrishna  tollywood  

Other Articles