Venkatesh heaps praise on Sumanth's first look సుమంత్ పై వెంకటేశ్ ప్రశంసలు.. అచ్చంగా..

Sumanth s look in first look poster of ntr biopic goes viral

sumanth, NTR Biopic, Akkineni, poster, sumanth first look, birthday, Bala krishna, sumanth in NTR biopic, Venkatesh, ntr, first look, Akkineni Nageswara Rao, tollywood, movies, entertainment

The makers of ‘NTR’ unveiled the first look poster of Sumanth as Akkineni Nageswara Rao on the occasion of the legendary actor’s birthday.

నెట్టింట్లో వైరల్ గా సుమంత్ ఫస్ట్ లుక్

Posted: 09/21/2018 08:06 PM IST
Sumanth s look in first look poster of ntr biopic goes viral

'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషిస్తున్నాడు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను రిలీజ్ చేశారు. మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో .. సుమంత్ కూడా అచ్చు అలాగే వున్నాడు.

ఈ పోస్టర్ చూసినవాళ్లు అందులో వున్నది అక్కినేని నాగేశ్వరరావేనని క్షణకాలం పాటు పొరపడ్డారు. అలాగే తాను కూడా కన్ఫ్యూజ్ అయ్యానని హీరో వెంకటేశ్ చెప్పారు. 'ఎన్టీఆర్' బయోపిక్ లో అక్కినేనిగా సుమంత్ లుక్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ పోస్టర్లో వున్నది సుమంత్ అనే స్పష్టత రావడానికి నాకు కొంచెం సమయం పట్టింది. అక్కినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినవాడిలా సుమంత్ కనిపిస్తున్నాడు. ఏఎన్నార్ చాలా గొప్పవ్యక్తి .. అలాంటి లెజెండ్ ను ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది' అని అన్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sumanth  NTR Biopic  Akkineni  poster  venkatesh  first look  birthday  tollywood  

Other Articles