100 Million plus views for Rangamma Mangamma రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

Rangasthalam, Ram Charan, #Rangasthalam #RangasthalamSongs #RangammaMangammaVideosong, Sukumar village drama, Samantha Akkineni, devi sri prasad, Baahubali sahore bahubali, movies, entertainment, tollywood

Ram Charan’s period-action entertainer ‘Rangasthalam’, now after 142 days from its release on YouTube, the video song of Rangamma Mangamma has clocked in 100 million views, surpassing Vachinde song from ‘Fidaa’ and Saahore from ‘Baahubali 2’.

రాంచరణ్ ‘రంగస్థలం’ పాట కూడా రికార్డు సృష్టించింది

Posted: 09/17/2018 01:49 PM IST
100 million views for ram charan and samantha akkineni s rangamma mangamma

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. అటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి.. నాన్ బాహుబలి చిత్రాలలో టాప్ ప్లేస్ లో నిలిచిన ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ కూడా అధిగమించి వసూళ్లను రాబట్టింది. దీంతో పాటు చాలా కాలం తరువాత ఏకంగా శతదినోవత్సవ పండుగను కూడా పూర్తి చేసుకుని ముందకు దూసుకెళ్తుంది.

రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించడం, ఈ అద్భుత చిత్రానికి సుకుమార్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టడం.. మొత్తానికి ఈ చిత్రం ఈ త్రయానికి పెద్ద హిట్ అందించింది. తాజాగా ఈ చిత్రం మరో మారు వార్తల్లో నిలిచింది. అయితే కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతలకే కాకుండా మరోకర విభాగానికి కూడా వన్నె తెచ్చింది.
అదేంటారా.? అక్కడికే వస్తున్నాం. ఈ చిత్రంతో మరోసారి తన మ్యూజిక్ సత్తాను చాటిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కు కూడా అరుదైన ఘనతను అందించింది. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉండగా.. ప్రతి పాట అందరినీ మెప్పించేలా కంపోజ్ చేశాడు. కాగా ఈ చిత్రంలోని రంగమ్మా మంగమ్మా వీడియో పాట  ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ పాట తాజాగా 100మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. దీంతో 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. దేవీ శ్రీ మ్యూజిక్, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా చేసింది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Ram Charan  samantha  RangammaMangammaVideosong  100 million views  tollywood  

Other Articles