Malayalam Actor Captain Raju Passes Away నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

Actor and director captain raju passes away in kochi

Telugu language, Malayalam, Kochi, kannada cinema, Indian Army, Captain Raju, malayam actor, kerala director, captain raju passed away, tollywood, kollywood, mollywood, bollywood

Veteran Kerala actor, Captain Raju, died on Monday at his residence in Kochi, said family sources. He was 68.

నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

Posted: 09/17/2018 12:21 PM IST
Actor and director captain raju passes away in kochi

ప్రముఖ నటుడు, విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజు మృతి చెందారు. ఈ నెల జూలైలో చెన్నై నుంచి మస్కట్ వెళ్తుండగా.. విమానంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది. దీంతో ఆయనను మొదట మస్కట్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత తదుపరి ట్రీట్‌మెంట్ కోసం కొచ్చికి తీసుకురాగా.. చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు రాజు. కాగా 1950 జూన్ 27న కేరళలో జన్మించిన కెప్టెన్ రాజు 21సంవత్సరాలోనే ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా జాయిన్ అయ్యారు.

అక్కడ ఐదు సంవత్సరాలు దేశానికి సేవలు చేసిన రాజు.. సినిమాల మీద ఇష్టంతో ఆర్మీ నుంచి వచ్చారు. ఆ తరువాత నటుడిగా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాలలో నటించారు. దర్శకుడిగా రెండు చిత్రాలను రాజు తెరకెక్కించారు. మరోవైపు ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడీ అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘గాంఢీవం’, ‘మొండి మొగుడు- పెంకి పెళ్లాం’ వంటి తెలుగు చిత్రాల్లో రాజు నటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Captain Raju  malayam actor  kerala director  passed away  tollywood  kollywood  mollywood  bollywood  

Other Articles