Vijay Deverakonda's Geetha Govindam for August 15 గీతా గోవిందం రిలీజ్ డేట్ ఫిక్స్..

Geetha govindam vijay rashmika starrer to release on 15 august

Vijay Deverakonda, Geetha Govindam, rashmika mandanna, tarun adarsh, Geetha Govindam release date, Geetha Govindam new poster, movies, entertainment, tollywood

Vijay Deverakonda and Rashmika Mandanna's upcoming film Geetha Govindam has locked its release date. The makers announced the date with the first look poster featuring the two stars.

‘‘గీతా గోవిందం’’ విడుదల తేదీ ఫిక్స్.. కొత్త పోస్టర్లో రిలీజ్ డేట్..

Posted: 07/03/2018 06:05 PM IST
Geetha govindam vijay rashmika starrer to release on 15 august

'ఐయామ్ స్టిల్ వర్జిన్' అంటున్నాడు విజయ్ దేవరకొండ. అదేంటి అంటే స్వతంత్ర్య, స్వేచ్చా పూర్తిగా లేనట్టుగా మీరు ఏమైనా అనుకోండి.. నా అఫిషియల్ స్టేటస్ మాత్రం ఇదే అంటూ ముభావంగా చెబుతున్నట్లు వుంది. అయితే సరిగ్గా స్వతంత్ర్య దినోత్సవం రోజునే వస్తున్న గీతా గోవిందంతో మన ముందుకు వస్తున్నాడు విజయ్. కన్నడ భామ రష్మిక మందనతో కలిసి 'గీత గోవిందం' ప్రమోషన్‌ లో బిజీగా వున్న విజయ్.. అగస్టు 15న వస్తున్నాడు. ఇప్పటికే ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి సరదా సంభాషణలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.

ఈ ఉదయం సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. "మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌" అంటూ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టర్‌ ను ఉంచాడు. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో "ఐ యామ్‌ 25. స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌" అని రాసుండగా, రష్మిక వైపు ఓరగా  చూస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. 'అర్జున్ రెడ్డి' వంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా మారిపోయిన హీరో దేవరకోండ విజయ్. ఎత్తు ఎదిగిన కొద్ది తాను మరింత బాధ్యతతో వ్యవహరిస్తూ.. వినమ్రంగా నడుచుకోవడం ఈ టాలీవుడ్ స్టార్ సొంతం. ఈ చిత్రాన్ని స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా, పరశురామ్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు.

Mark the date: 15 Aug 2018... First look poster of Telugu film #GeethaGovindam... Stars Vijay Deverakonda and Rashmika Mandanna... Allu Aravind presentation... Directed by ParasuRam... #GeethaGovindamFL #GeethaGovindamOnAug15th #IndependenceDay pic.twitter.com/FfGW51mopR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Deverakonda  Geetha Govindam  rashmika mandanna  tarun adarsh  tollywood  

Other Articles