Ayesha Takia's husband claims death threats బెదరింపు కాల్స్ వస్తున్నాయ్.. బేటీ బచావో మోదీజీ..!

Ayesha takia stalked harassed husband seeks pm modi sushma s intervention

actress threat calls, threat calls actress, threatening calls, Ayesha Takia, Ayesha Takia Azmi, Bollywood, DCP Paramjit Singh Dahiya, Farhan Azmi, Joint Commissioner of Police, Mumbai Police, latest movie news, kollywood, movies, entertainment

Bollywood actress Ayesha Takia’s husband and SP leader Abu Azmi’s son Farhan Azmi on Twitter alledged that his wife, mother and sisters are beings talked by a litigant.

బెదరింపు కాల్స్ వస్తున్నాయ్.. బేటీ బచావో మోదీజీ..!

Posted: 07/04/2018 05:34 PM IST
Ayesha takia stalked harassed husband seeks pm modi sushma s intervention

తెలుగులో 'సూపర్' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా టకియాను, ఆమె కుటుంబీకులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడట. చంపేస్తానని బెదిరిస్తున్నాడట. అమె మతాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలోనే తనకు ఈ తరహా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయేషా భర్త, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫర్హాన్ అజ్మీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ లు తమకు సాయపడాలని విజ్ఞప్తి చేస్తూ 'బేటీ బచావో' అని ఓ పోస్టు పెట్టాడు.

తన భార్యతో పాటు అమ్మ, అక్క చెల్లెళ్లు బెదిరింపులకు గురయ్యారని చెప్పాడు. డీసీపీ దహియాకు ఫిర్యాదు చేస్తే ఆయన చూసీ చూడనట్టు ఊరుకున్నారని ఆరోపిస్తూ, దహియాకు చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్లను ఫర్హాన్ పోస్టు చేసి, తమకు మద్దతు తెలపాలని నెటిజన్లను కోరాడు. ఆయన వరుసగా ట్వీట్లు పెడుతుండటంతో ముంబై జాయింట్ సీపీ దేవేన్ భారతి స్పందించి, విచారించి నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఫర్హాన్ అజ్మీ తనకు ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం వుందని, మూడు చెడిపోయిన అపిల్స్ తో జరిగేనష్టమేమి వుండదని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Takia  farhan azmi  threat calls  mumbai police  bollywood  

Other Articles