bharat ane nenu 50 days Collections Report 50 రోజుల దాటి దూసుకెళ్తున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’

Mahesh babu attack on box office bharat ane nenu 50 glorious day

Koratala Siva, Kaira Advani, Bharat Ane Nenu, Mahesh Babu, Tollywood, Box Office Collections, Bharat Ane Nenu Total Collections, movies, entertainment, tollywood

Bharat Ane Nenu starring Super Star Mahesh Babu is celebrating a successful run of 50 days today. The movie has set great records at the box office already which proved the craze of the actor.

50 రోజుల దాటి దూసుకెళ్తున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’

Posted: 06/08/2018 01:28 PM IST
Mahesh babu attack on box office bharat ane nenu 50 glorious day

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ అర్థశతదినోత్సవం పోస్టర్స్‌ను విడుదల చేసింది. తొలిరోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లను రాబడుతూ నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మహేష్ కెరియర్లోనే బెగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

సందేశాత్మక చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి.. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో.. ఉన్నతమైన నిర్మాణంతో మంచి సంగీతం, నేపథ్యగానం.. భారీ తారాగణం అన్ని కలసివచ్చియనే చెప్పాలి. విడుదలైన మూడు వారాల్లో రూ. 149.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. మహేశ్ బాబు కెరియర్లో 92 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తాజాగా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరిన్ని కలెక్షన్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఈ చిత్రం మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 22 కోట్లకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు అత్యధిక రేటుకు అమ్ముడైన విషయంలో 'బాహుబలి' తరువాత స్థానంలో 'భరత్ అనే నేను' నిలిచింది. కథాకథనాలు .. కొరటాల - మహేశ్ కాంబినేషన్ .. మహేశ్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ .. సంగీత సాహిత్యాలు ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తీసుకొచ్చాయనే మాట వాస్తవం.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koratala Siva  Kaira Advani  Bharat Ane Nenu  Mahesh Babu  Box Office Collections  Tollywood  

Other Articles

  • Nawab second trailer a feud of bloody proportions

    విడుదల ముంగిట.. అభిమానులకు మణిరత్నం ట్రీట్..

    Sep 22 | దర్శక దిగ్గజం.. మణిరత్నం రూపొందించిన ఎన్నో ఆణిముత్యాలు తమిళనాడు నుంచి దక్షిణాదిని, అటు పిమ్మట భారతీయ చలనచిత్ర రంగాన్ని ఓ కుదుపు కుమ్మేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆయన అధికంగా శ్రమించి... Read more

  • Is venkatesh s daughter opting for love marriage

    ప్రేమ పరిణయానికి సిద్దమైన వెంకటేష్ తనయ`

    Sep 22 | ‘ప్రేమ తో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమింటే ఇదేరా.. కలిసుందాం రా..’ లాంటి ప్రేమ కథా చిత్రాలతో పాటు బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం, వంటి చిత్రాలతో విజయాలను అందుకుని విక్టరీని తన ఇంటి... Read more

  • Actress trisha trolled for kissing dolphins in public

    పబ్లిక్ లో ముద్దుపెట్టిన ముద్దుగుమ్మకు నెట్టింట్లో షాక్.!

    Sep 22 | దక్షిణాధి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుని అందాల అమ్మడు.. అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో రమారమి అందరు అగ్రహీరోలతో నటించింది. ప్రస్తుతం తమిళనాట వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష..... Read more

  • Himanshi to play purandeswari role in ntr biopic

    ఎన్టీఆర్ తనయ పురందేశ్వరిగా బెజవాడ డాన్సర్

    Sep 22 | ‘యన్టీఆర్‌’ సినిమాలోని పాత్రలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబునాయుడిగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌.. తదితర పాత్రల గురించి అధికారికంగా వెల్లడించారు. అయితే ఇందులో యన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిగా... Read more

  • Sumanth s look in first look poster of ntr biopic goes viral

    నెట్టింట్లో వైరల్ గా సుమంత్ ఫస్ట్ లుక్

    Sep 21 | 'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషిస్తున్నాడు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ... Read more

Today on Telugu Wishesh