Second schedule of 'Haathi Mere Saathi' complete రాణా త్రిబాష చిత్రం.. తెలుగు టైటిల్ ఇదేనా..

Rana daggubati starrer haathi mere saathi titled aranya in telugu

Aranya, Haathi Mere Saath, Haathi Mere Saathi titles for Tamil and Telugu, Kaadan, Rana Daggubati, Rana fim title, Telugu, Hindi, Tamil Kaadan, movies, entertainment, tollywood, kollywood, bollywood

Rana Daggubati starrer upcoming movie Haathi Mere Saathi, directed by Prabhu Solomon, has been titled as Aranya in Telugu and Kaadan in Tamil.

రాణా త్రిబాష చిత్రం.. తెలుగు టైటిల్ ఇదేనా..

Posted: 06/04/2018 08:06 PM IST
Rana daggubati starrer haathi mere saathi titled aranya in telugu

దేశవ్యాప్తంగా పెను సంచలన చిత్రంగా ప్రత్యేకతను సాధించి.. భారతీయ చలనచిత్ర రంగంలో ఒక తెలుగు సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకుందన్న రికార్డును నెలకొల్పిన చిత్రం..'బాహుబలి'. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రాణా సంపాదించిన క్రేజ్ కూడా అంతాఇంతా కాదు.  దీంతో ఆయన తన క్రేజ్ ను కాపాడుకుంటూ .. దానిని మరింత పెంచుకునే కథలను మాత్రమే అంగీకరిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో విజయాన్ని అందుకుని దూసుకుపోతున్నాడు రాణా.

ఈ నేపథ్యంలోనే ఆయన హిందీలో 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఏనుగులతో హీరోకి గల స్నేహ సంబంధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఎక్కువభాగం షూటింగ్ అడవుల్లో జరుగుతోంది. హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి 'కాదన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇటీవలే రెండో షెడ్యూలు కూడా పూర్తైంది. రమారమి ఈ చిత్రం మరో షెడ్యూలు తరువాత షూటింగ్ కు సెలవు ప్రకటించనుందని టాక్. దీంతో రిరికార్డింగ్ సహా పోస్టు ప్రోడక్షన్ పనులను పూర్తి చేసుకుని దీపావళి పండగ బరిలో ఈ సినిమాను నిలపాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ఒకేసారి ఈ మూడు భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఈ మూడు భాషల్లోను విజయాన్ని సాధిస్తుందనీ .. తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందని రానా భావిస్తున్నాడు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aranya  Telugu  Haathi Mere Saath  Hindi  Tamil Kaadan  Rana Daggubati  Rana fim title  tollywood  

Other Articles