kaala movie worldwide first day collections రజనీ గత చిత్రాలకు భిన్నంగా.. కాలా వసూళ్లు

Kaala movie worldwide first day collections

kaala Telugu Movie, kaala, kaala 1st day collections, kaala collections, kaala world wide gross, kaala share, Rajnikanth, Rajnikanth kaala, Rajni kanth, Rajnikanth mumbai backdrop, rajnikanth kaala flashback, rajnikanth eeshwari rao, rajnikanth nanapatekar, rajni kanth danush, rajnikanth huma khureshi, huma khureshi, eeshwari rao, nanapatekar, dhanush, pa ranjith, movies, entertainment, tollywood

Kaala 1st day collections are very dull. kaala the movie which is a more Ranjith movie, than Rajinikanth, which given the fact that Rajinikanth isn’t merely a star anymore. the collection sunami for rajani movies is washed out with kaala.

కాలా చిత్రం తొలిరోజు వసూళ్లు ఇలానా..

Posted: 06/08/2018 02:58 PM IST
Kaala movie worldwide first day collections

దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా విడుదలైందటే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించినట్టే. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో, అత్యధిక కేంద్రాల్లో రజనీ చిత్రం విడుదల అవుతుంది. దీంతో వసూళ్ల పరంగా కూడా అత్యధిక కలెక్షన్లు ఖాయమనే అంచనాలు అటు అభిమానుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో వున్నాయి. ఓవర్సీస్ లో కూడా రజనీకి మంచి మార్కెట్ ఉండడంతో మొదటి రోజే కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తుందని భావిస్తుంటారు. గతంలో విడుదలైన అనేక చిత్రాలు ఈ అంచనాలను అందుకున్నాయి.

కానీ.. తొలిసారిగా రజనీకాంత్‌ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు అసలు ఆశాజనకంగా లేకుండా వున్నాయంటే అది తాజాగా విడుదలైన కాలా చిత్రానికేనని వార్తలొస్తున్నాయి.  క్రితం రోజు విడుదలైన కాలా కలెక్షన్లు రజనీ గత సినిమాలకు దరిదాపుల్లో కూడా లేవని విశ్లేషకులు అంటున్నారు. రజనీకాంత్‌ ను హీరోగా ఎలివేట్ చేసి.. మాస్ అడియన్స్ కు తగినట్లుగా డైలాగులు పెడితే సినిమా హిట్ చేసే అభిమానుల సంఖ్య రజనీకి తక్కువేం లేదు. అయితే వారి అభిమాన హీరోని సగటు వ్యక్తిగా చూపడంతో వారి అధరణకే చిత్రం నోచుకోలేదా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

గత సినిమా కబాలీ ఫ్లాప్ కావడం, తక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్‌ చేయడంతోపాటు కావేరి వివాదంతో కర్ణాటకలో సినిమాను అడ్డుకోవడం వంటి కారణాలు ఫస్ట్‌ డే ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపించాయని చెప్పవచ్చు. ఈ సినిమాకు కబాలి రేంజ్‌లో క్రేజ్‌ కూడా రాలేదు.  బహుశా ఆ ఎఫెక్ట్‌ కూడా ఈ సినిమాపై పడిందనుకోవచ్చు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినందుకు  ప్రమోషన్స్ బజ్ క్రియేట్ అయితే వసూళ్లు ఊపందుకుంటాయని రజనీ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaala  rajnikanth  1st day collection  gross  tollywood  movies  entertainment  

Other Articles