Jr NTR at First Day Shoot of Trivikram Movie ఎన్టీయార్-త్రివిక్రమ్ ల చిత్రానికి లైట్స్ కెమెరా ఆన్..

Jr ntr at first day shoot of trivikram movie

jr ntr, jr ntr first look in trivikram srinivas, trivikram srinivas, celebrities, telugu, tollywood, movies, entertainment

Finally, the much-awaited combination movie of Jr NTR and Trivikram Srinivas started today with regular shooting. The movie team is currently canning an action sequence for this flick. Jr NTR lost almost 25 kgs weight for this flick.

ఎన్టీయార్-త్రివిక్రమ్ ల చిత్రానికి లైట్స్ కెమెరా ఆన్..

Posted: 04/13/2018 07:04 PM IST
Jr ntr at first day shoot of trivikram movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం అభిమానులకు తెలిసిందే. కాగా, ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న దగ్గర నుంచి.. ఇక చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని యంగ్ టైగర్ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తరుణంలో వారికో గుడ్ న్యూస్. ఎన్టీయార్, త్రివిక్రమ్ కాంభినేషన్ చిత్రం ఇవాళ పట్టాలెక్కేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్ తో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ప్రారంభించారు. రామ్ - లక్ష్మణ్ డిజైన్ చేసిన ఒక ఫైట్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రోజున మొదలెట్టిన ఈ షెడ్యూల్ ఈ నెల 25 వరకూ కొనసాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఖరారు చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాణ సంస్థ సన్నధమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles