Pawan Kalyan's Agnathavasi First Look పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పస్ట్ లుక్ టెర్రిఫిక్

Agnathavasi first look pawan kalyan with id card in office

Pawan Kalyan 25 movie first look, PK Agnathavasi First Look, Trivikram agnathavasi, pawan agnathavasi, Keerthy Suresh agnathavasi, PSPK25 agnathavasi, Pawan Kalyan, Agnathavasi, First Look, Trivikram, Keerthy Suresh, PSPK25, Tollywood, telugu movies

Ending the wait of million of fans, the most awaited title and first look of Pawan Kalyan's 25th film have been just revealed.

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పస్ట్ లుక్ టెర్రిఫిక్

Posted: 11/27/2017 01:31 PM IST
Agnathavasi first look pawan kalyan with id card in office

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సర్ ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెద్దఎత్తున్న వున్నాయి. పవన్ 25వ చిత్రం కాబట్టి హైప్ కూడా క్రియేటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ పై కూడా పవన్ అభిమానుల్లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తుంది.

కాగా ఈ చిత్రానికి ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే 'అజ్ఞాతవాసి' అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. ఫస్ట్‌లుక్‌లో పవన్‌ సోఫాలో స్టైల్‌గా కూర్చుని కోపంగా చూస్తూ చేతిలో ఐడీ కార్డు తిప్పుతున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. దీంతో ఇది కూడా అత్తారింటికి దారేది అన్న కథాంశం నేపథ్యంలోనే వస్తుందన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా విడుదలైందో లేదో.. అలా ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు అభిమానులు. రెండురోజుల నుంచే ‘పీఎస్ పీకే 25 ఫస్ట్ లుక్‌’ అన్న హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఈ ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్.. సాంకేతిక సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా విడుదల చేశామని చిత్ర నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాన్ సరసన హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Agnathavasi  First Look  Trivikram  Keerthy Suresh  PSPK25  Tollywood  telugu movies  

Other Articles