కొత్త చిత్రం గురించి సాహో బ్యూటీ ఏమంటోంది? | Shradda Kapoor About Haseena Parkar Movie

Shradda kapoor haseena parker interview

Saaho Actress, Shraddha Kapoor, Haseena Parkar Biopic, Haseena Parkar Movie, Haseena Parkar Shradda Kapoor, Haseena Parkar Role, Shradda Kapoor Challenging Role

Actress Shraddha Kapoor who will soon be seen in 'Haseena Parkar', thinks the challenge for her is to do better work and make improvement in her craft. The actor will also be seen in the biopic of Indian badminton player Saina Nehwal and in 'Saaho' along with Prabhas.

ఆమె చాలా టఫ్.. చాలెజింగ్ రోల్ లో చేశా: శ్రద్ధాకపూర్

Posted: 09/11/2017 05:01 PM IST
Shradda kapoor haseena parker interview

బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు తెలుగులోనూ శ్రద్ధా కపూర్ కి భలే క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ సాహో మూలంగానే అది జరిగిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం మూలంగానే శ్రద్ధను ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక శ్రద్ధ చేతిలో ఉన్న స్పెషల్ బయోపిక్ ల గురించి ఇప్పుడు చెప్పుకోవాలి.

అందులో ఒకటి షటిల్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ కాగా, మరోకటి దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 22న హసీనా పార్కర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్ హసీనా తన అనుభవాలను షేర్ చేసుకుంటోంది.

సాహోలో ఛాన్స్ మిస్సయిన సౌత్ బ్యూటీ

దావూద్ మాఫియా డాన్ గా ఎదగడంలో హసీనా పాత్ర చాలా కీలకమైనదని చెబుతుంటారు. దావూద్ కన్నా ఆమె జీవితంలోనే ఇంకా ఆసక్తికరమైన విశేషాలే ఎక్కువని అంటుంటారు కూడా. అది నిజం. సినిమా షూటింగ్ టైంలో ఆమె గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. అయితే తన కెరియర్లో ఎంతో ఛాలెంజింగ్ గా చేసిన పాత్ర ఇదేనని చెప్పింది. నటిగా తన సత్తాను చాటే పాత్ర ఇదని అంటోంది.

అంతటి పవర్ ఫుల్ 'హసీనా పార్కర్' జీవిత చరిత్రను, దర్శకుడు అపూర్వ లఖియా ఎంతో ఎగ్జయిటింగ్ గా తెరకెక్కించాడని శ్రద్ధా చెప్పింది. ఇక చిత్రంలో దావూద్ ఇబ్రహీమ్ పాత్రలో సిద్ధాంత్ నటించాడు. అతను నిజజీవితంలో కూడా శ్రద్ధాకు బ్రదర్ కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles