సాహోలో ఛాన్స్ మిస్సయిన ఈ బెంగళూర్ అమ్మాయి ఎవరో తెలుసా? | Bangalore Beauty miss chance in Saaho

Shraddha kapoor replaces nidhi agarwal for saaho

Saaho, Saaho Heroine, Prabhas Saaho, Saaho Actress, Saaho Sharadda Kapoor, Shradda Kapoor Nidhi Agarwal, Nidhi Agarwal Baahubali Star, Nidhi Agarwal Prabhas, Nidhi Agarwal Saaho Movie

Finally Prabhas's Saaho Movie Heroine Finalized. Shraddha’s shocking remuneration for Saaho. Actually Makers Primarily Consider Bangalore Girl Nidhi Agarwal.Tiger Shroff's Munna Michael poor result they dropped later and fixed for Shradda.

సాహోలో శ్రద్ధ కపూర్ కన్ఫర్మ్.. నిధికి ఛాన్స్ మిస్

Posted: 08/16/2017 11:45 AM IST
Shraddha kapoor replaces nidhi agarwal for saaho

ప్రభాస్ 'సాహో' సినిమాకి మొత్తానికి సస్సెన్స్ కి తెర దించుతూ బాలీవుడ్ భామనే ఫైనలైజ్ చేసేశారు. అనుష్క, పరిణితి, పూజాహెగ్డే ఇలా పేర్లు వినిపించినప్పటికీ చివరకు ఆషికి 2 హీరోయిన్ శ్రద్ధా కపూర్ కే ఆ ఛాన్స్ దక్కింది. దాదాపు డజన్ పైగా సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ పేరు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నప్పటికీ, చివరకు నిన్న కన్ఫర్మ్ చేస్తూ యూవీ క్రియేషన్స్ ఓ ట్వీట్ వేసింది.

నిజానికి ఈ ఆఫర్ మరో బాలీవుడ్ బ్యూటీకే దక్కాల్సి ఉందట. టైగర్ ష్రాఫ్ తో మున్నా మైఖేల్ హిట్ నటించిన బెంగళూర్ భామ నిధి అగర్వాల్ కు ఆ ఛాన్స్ ఇవ్వాలనుకున్నారంట. కానీ రీసెంట్ గా రిలీజైన ఆ సినిమా డిజాస్టర్ కావటంతో ఆ ఆలోచనను 'సాహో' దర్శక నిర్మాతలు విరమించుకున్నారు. ఫలితంగా ఛాన్స్ కాస్తా శ్రద్ధా కపూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా 4 కోట్ల పారితోషకంతో శ్రద్ధాను ఈ ఆఫర్ వరించినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరిస్తోంది.

Nidhi Agarwal Saaho Chance Miss

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాకి, శంకర్ - ఎహసాన్ - లాయ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఆరు నెలలు వరుస షూటింగ్ తో సినిమాను పూర్తి చేసి వచ్చే ఆగష్టు నాటికి రిలీజ్ కు ఫ్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇదే ఏడాది ప్రభాస్ మరో చిత్రం కూడా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Prabhas Shradda Kapoor

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho Movie  Prabhas  Shradda Kapoor  Nidhi Agarwal  

Other Articles