Neha Dhupia Met With An Accident In Chandigarh బాలీవుడ్ హీరోయిన్ కు ప్రమాదం.. సెల్పీలకు ఎగబడ్డ జనం

Neha dhupia met with an accident but onlookers ask for selfies

Neha Dhupia, Neha Dhupia accident, No Filter Neha 2, roadies, Shweta Mehta, Shweta Mehta Neha Dhupia gang, neha dhupia bollywood actress, chandigarh, Entertainment News, lastest entertainment news, filter neha 2, neha dhupia chandigarh, bollywood, entertainment`

Bollywood actress Neha Dhupia car met with an accident in Chandigarh while she was rushing to Airport to catch her flight. The traffic came to a standstill after the accident and Neha was stalled for selfies, autographs on the road for than an hour.

బాలీవుడ్ హీరోయిన్ కు ప్రమాదం.. సెల్పీలకు ఎగబడ్డ జనం..!

Posted: 08/12/2017 12:15 PM IST
Neha dhupia met with an accident but onlookers ask for selfies

మారుతున్న కాలంలో పాటు మనుషులు కూడా మరింత వేగంగా మారుతున్నారు. తరతరాలకు మధ్య అనుబంధాలు, అప్యాయతల విషయాన్ని పక్కనబెడితే.. సాటి మనుషులకు ఏదో చేయాలన్న భావన, తోటి వారికి సాయం చేయాలన్న అలోచన, కనీసం అపదలో వున్న వారికి అభయహస్తాన్ని అందించాన్న యోచన కూడా నేటి తరం యువతలో లోపిస్తుంది. ఎంతసేపు సోషల్ మీడియానే తమ ప్రపంచమనుకుని.. వారితో స్నేహాలు, లైకులు. ఇదే జీవితమని భావిస్తున్నారు.

హైదరాబాద్ హైటెక్ సిటీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో అక్కడి హైటెక్ సిటీ వాసులు అయనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు.. అయతే అంతకన్నా అధిక సమయాన్ని వారు సెల్పీలు, ఫోటోలు, వీడియోలు తీయడానికి కేటాయించారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడానికి వినియోగించారు. అందులో వచ్చిన లైకులే వారికి కడుపు నింపాయి. ఈ ఘటనపై ప్రకాష్ రాజ్ ఘాటుగానే స్పందించాడు. సాయం చేయడం నేర్చుకోండీ.. వీడియోలు తీయడం కాదని అన్నాడు. అయినా నేటి తరం యువతలో మాత్రం మార్పు రాదు.

తాజాగా బాలీవుడ్ భామ నేహా ధూపియా కూడా చండీగఢ్ లో ప్రమాదం బారిన పడ్డారు. తాను చేస్తున్న నో ఫిల్డర్ నెహ-2 షో ప్రమోషన్ కోసం అమె చంఢీగఢ్ వెళ్లారు. ఇక అక్కడి నుంచి తిరుగ ప్రయాణంలో విమానాశ్రయానికి చేరుకుంటున్న సమయంలో అమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాకపోయినా, ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో, విమానాశ్రమానికి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదానికి గురైన వారికి సాయం చేద్దామనుకుని ముందుకెళ్లిన వారు అందులోని నేహా దూఫియాను గుర్తుపట్టారు.

అప్పటి వరకు ట్రాఫిక్ జామ్ అయ్యిందన్న వాహనదారులు కూడా నేహాతో పాటు కారులో వున్నవారి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. అమెకు ఏమైనా గాయాలయ్యాయా..? అన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. నిత్యం సెక్యూరిటీ మద్య వుంటే నటి.. నడిరోడ్డు మీద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కనిపించే సరికి అమెతో ఫోటోలు, సెల్పీలు, అటోగ్రాప్ తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఇక చేసేది లేక అమె అరగంట పాటు అడిగిన వారికి అడిగింది ఇచ్చుకోక తప్పలేదు. ఆ తర్వాత వేరే కారు రావడంతో... బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది. కారు బ్రేకులు పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ఆమె పీఆర్వో తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neha Dhupia  accident  No Filter Neha 2  chandigarh  bollywood  entertainment  

Other Articles

 • Raj taruns raju gadu to hit theaters on june 1st

  మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

  May 24 | యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం,... Read more

 • Balakrishna to produce his next

  బయోపిక్ కాకుండా మరో చిత్రానికి కూడా బాలయ్యే నిర్మాత.?

  May 24 | యువరత్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని తానే నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రానికి కూడా ఆయనే నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారా.? అంటే అవుననే చిత్రపురి వర్గాల... Read more

 • Raja mouli gives good news to ram charan jr ntr fans

  రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులకు దర్శకదిగ్గజం తీపికబురు

  May 24 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ నందమూరి తారక్ (జూనియర్ ఎన్టీయార్) అభిమానులకు ఓ తీపికబురు చెబుతున్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరు యంగ్ హీరోలు కథనాయకులుగా ఆయన రూపొందించనున్న... Read more

 • Madhavan to play villain role in savyasachi

  సవ్యసాచిలో అలా కనిపించనున్న మాధవన్

  May 21 | రొమాంటిక్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఆయన అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అమీర్ ఖాన్ తో పాటు నటించడంతో పాటు సోలో... Read more

 • Vikram and keerthy suresh to head to europe for saamy 2

  విక్రమ్ తో కలసి యూరప్ కి కీర్తి సురేశ్

  May 21 | విక్రమ్ హీరోగా నటించిన సామి చిత్రం బాక్సాఫిసు బద్దలు కోట్టిన నేపథ్యంలో అదే దర్శకుడి సారథ్యంలో సామి చిత్ర సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో 'సామి 2' సినిమా... Read more

Today on Telugu Wishesh