డీజే ఫస్ట్ లుక్: డొక్కు స్కూటర్.. కూరగాయలు.. ఓ డీసెంట్ బాయ్ Allu Arjun decent look in DJ first look.

Allu arjun dj movie first look out

Allau Arjun DJ First Look, DJ Movie First Look, Allu Arjun DJ Look, DJ First Look, Bunny Decent Look, Allu Arjun Duvvada Jagannadham First Look, Duvvada Jagannadham Movie First Look, DJ First Look, Bunny DJ Movie First Look

Allu Arjun Duvvada Jagannadham (DJ) official first look released.

అల్లు అర్జున్ డీజే ఫస్ట్ లుక్ వచ్చేసింది

Posted: 02/18/2017 10:38 AM IST
Allu arjun dj movie first look out

మొత్తానికి మెగా ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది. దువ్వాడ జగన్నాథం సినిమాలో బ్రహ్మణ అవతారంలో బన్నీ ఎలా ఉండబోతున్నాడోనన్న అనుమానాలను పటాపంచల్ చేస్తూ ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

సింపుల్ లుక్కులో అల్లు అర్జున్ పాత్ర ఉన్నట్లు అర్థమైపోతుంది. నీట్ గా తలదువ్వుకుని నుదుట విబూతితో గుడ్ బాయ్ గా బన్నీ ఆకట్టుకున్నాడు. ఓ అగ్రహారం బ్యాగ్రౌండ్ లో ఓ పాత స్కూటర్ మీద బన్నీ కూరగాయలు మోసుకొచ్చే పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ ను గమనిస్తే బహుశా ఓ వంటవాడి పాత్రలో కనిపిస్తాడేమోనని అనిపిస్తుంది. లుక్కు పరంగానే కాదు ఫిజికల్ గా కూడా బన్నీ పిట్ గా ఉన్నట్లు నిన్న లీక్ అయిన ఫోటోలతో అర్థమైతుంది.

 

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న డీజేలో ఎంటర్ టైన్ మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్నాడు. ఏప్రిల్ లో దువ్వాడ జగన్నాథమ్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

బన్నీ లుక్ లీక్ ఎవరి పని?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  Allu Arjun  First Look  

Other Articles