ఓం నమో దెబ్బ.. డిఫ్రెషన్ లోకి నాగ్ ? | Om Namo Venkatesaya seems to have upset Nagarjuna a lot.

Nag upset by om namo venkatesaya collections

Om Namo Venkatesaya, Om Namo Venkatesaya Collections, Om Namo Venkatesaya Loss, Om Namo Venkatesaya Nagarjuna, Nag Upset ONV Collections, ONV Commercial Flop, Akkineni Nagarjuna Om Namo Venkatesaya Flop, Nag Depression

Om Namo Venkatesaya seems to have upset Nagarjuna a lot. The commercial failure of the film had come as a shock to him and he remained holed up in residence for two days without taking any calls or meeting anyone.

ఓం నమో కలెక్షన్లు.. నాగ్ తెగ ఫీలయిపోతున్నాడు

Posted: 02/16/2017 03:35 PM IST
Nag upset by om namo venkatesaya collections

దాదాపు 12 సినిమాల తర్వాత(మధ్యలో కింగ్ యావరేజ్) హిట్ చవిచూసిన అక్కినేని నాగార్జునకు మనం తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్లు పడుతూనే ఉన్నాయి. కుర్రహీరోలకు పోటీగా ప్రయోగాలు చేసుకుంటూ వరుసగా 50 కోట్ల సినిమాలు ఇస్తూ వచ్చాడు నాగ్. అయితే నిర్మాతగా అటు నిర్మలా కాన్వెంట్ వేసిన దెబ్బ నుంచి కోలుకునే లోపే ఓం నమో వేంకటేశాయ మరోకటి వేసింది.

రాఘవేంద్ర రావు లాంటి దర్శకుడితో హిట్ కాంబినేషన్, పైగా అంతగా తెలియని కథ కావటంతో ఖచ్ఛితంగా హిట్ అయి తీరుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించాడు నాగ్. ఆ ఊపులోనే దగ్గరుండి మరీ భారీగా బిజినెస్ చేయించాడు. నాగ్ భక్తితో మళ్లీ కొట్టాడు... అంటూ రివ్యూలు కూడా భీభత్సమైన రేటింగ్ లు ఇచ్చేశాయ్. ముఖ్యంగా నాగ్ నటననే హైలెట్ చేస్తూ క్రిటిక్స్ కూడా పొగడ్తలు కురిపించారు. కానీ, కలెక్షన్ల దగ్గరికి వచ్చే సరికి సీన్ తారు మారు అయ్యింది.

సగానికి సగం బిజినెస్ చేయటమే ఇప్పుడు కష్టతరంగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంటే, ఓవర్సీస్ లో వర్ణనాతీతంగా ఉన్నాయంట. దీంతో బయ్యర్లకు భారీ లాస్ తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు ట్రేడ్ పండితులు. ఇక సినిమాపై అంచనాలు పెట్టుకున్న టాక్ బాగున్నా కమర్షియల్ ప్లాప్ అయ్యేసరికి కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఇంటికే పరిమితం అయిన నాగ్, ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉన్నాడని టాక్.

నాగ్ కెరీర్ లో హిట్ల కన్నా ఫ్లాపుల పర్సంటేజే ఎక్కువగా ఉందన్న విషయం స్వయంగా తానే ఒప్పుకుంటాడు. భాయ్, షిరిడి సాయి, గ్రీకు వీరుడు లాంటి డిజాస్టర్లు వచ్చిన సమయంలో కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా బయట తిరిగాడు కూడా. అలాంటిది ఓం నమో వేంకటేశాయ ఫలితం పట్ల మాత్రం నాగ్ ను తీవ్రంగా బాధించిందని తాజా పరిణామాలతో అర్థమౌతోంది. ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉంటే మాత్రం వాళ్లకు కూడా ఎమోషల్స్ ఉండవా చెప్పండి?. చివరి ప్రయత్నంగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత అయినా కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి మరి. 

 

ఇది కూడా చదవండి... దిల్ రాజు లెక్క టోటల్ గా తప్పింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni nagarjuna  Om Namo Venkatesaya  Commercial Flop  Collections  

Other Articles