లేట్ అయినా ఉపాసన భలే చెప్పింది | Upasana late Valentines Wishes.

Upasana kamineni late valentines wishes

Upasana Kamineni, Upasana Kamineni Ram Charan, Upasana Valentines Day, Upasana share Charan Pics,

Upasana Kamineni share fun moments with Ram Charan on Valentines Day.

చెర్రీతో ఉపాసన.. బెస్ట్ మూమెంట్స్

Posted: 02/16/2017 04:31 PM IST
Upasana kamineni late valentines wishes

స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారి ఆపై పెళ్లితో ఒక్కటయ్యే జంటలు సినిమా ఫీల్డ్ లో బోలెడు. తాజాగా సమంత- నాగ చైతన్య కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయారు కూడా. అయితే జంటగా మారిన తర్వాత అదే అన్యోన్యం కంటిన్యూ చేయటం అంటే మాములు విషయం కాదు. కానీ, మెగా వారసుడు రాంచరణ్, ఉపాసన లు మాత్రం చాలా ప్రత్యేకం. ఎడతెరపని బిజీతో సమయం గడిపే వాళ్లు కాస్త తీరిక దొరికిందంటే చాలూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపించేసుకుంటారు.

సినిమాలతోనే కాదు వ్యాపారాలతో కూడా చెర్రీ కి తెగ జిబీగా ఉంటాడు. మరోవైపు ప్రఖ్యాత ఆస్పత్రులకు హెడ్ గా ఉపాసన కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటుంది. అయినప్పటికీ ఈ జంట వాళ్ల ప్రేమను ఎలా వ్యక్తం చేసుకుంటారో తెలుసా? పెళ్లైన తొలినాళ్ల నుంచి చెర్రీ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటుంది ఉపాసన. అలాగే బహుమతుల పేరిట ఏదో ఒక సర్ ప్రైజ్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాడు చరణ్.

ఇక ఈ వాలెంటైన్స్ డే కి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అంటూ కొన్ని ఫోటోలు ఉంచింది ఉపాసన. తన భర్తతో గడిపిన కొన్ని సంతోషకరమైన మూమెంట్లను ఫోటోల రూపంలో చేర్చి తన సోషల్ మీడియాలో ఉంచింది. ఫోటో కాస్త ఆలస్యంగా షేర్ చేస్తున్నా అని చెబుతూనే ఇద్దరు కలిసి గడిపిన మధుర క్షణాలు అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని హ్యాపీ జీవితాన్ని గడుపుతున్నానంటూ తెలిపింది.

 

వాలెంటైన్స్ డే స్వీట్ కపుల్ ఏం చేశారంటే...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Upasana kamineni  Ram Charan  valentines day  

Other Articles