సమంత ఆన్సర్ తో హర్టయిన త్రివిక్రమ్.. అందుకే పవన్ సినిమాకి నో ! | Is Samantha Really Hurts Trivikram.

Trivikram shocking decision for pawan movie

Samantha Pawan kalyan, Pawan kalyan Trivikram Movie, Trivikram Samantha, Samantha Trivikram, Samantha Ruth Prabhu latest news, Trivikram Srinivas, Sam in Pawan Movie, Samntha in PK Movie

Reason behind Samantha exit from Trivikram for Pawan kalyan's Next. Samantha quits pawan Movie. trivikram insulted by Samantha, Trivikram hurt with Samantha

పవన్ సినిమాపై మళ్లీ పుకార్లు

Posted: 11/09/2016 04:05 PM IST
Trivikram shocking decision for pawan movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ తో మూడోసారి మ్యాజిక్ చేసేందుకు సిధ్ధమైపోయాడు. ఈ మధ్యే పూజా కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. ఇందుకోసం మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తోసహా టెక్నికల్ టీం అంతా సిద్ధం అయిపోయింది. కానీ, అసలు వ్యవహారమే ఇంకా తేలలేదు.

అదేనండీ హీరోయిన్ల గురించి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చెప్పినప్పటికీ వారి పేర్లు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే తన గత మూడు చిత్రాల్లో సమంతను తీసుకున్న త్రివిక్రమ్ ఆ ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తూ మళ్లీ ఆ బ్యూటీనే తీసుకోబోతున్నాడని అంతా అనుకున్నారు. ఇంతలో అ.ఆ.. లో ఓ పాత్ర పోషించిన అనుపమా పరమేశ్వరన్ బెర్త్ ఖరారైందన్న మరో వార్త వచ్చింది.

అయితే ఈ విషయంపై అటు నిర్మాత రాధాకృష్ణన్ నుంచి గానీ, ఇటు చిత్ర యూనిట్ నుంచి గానీ ఎటువంటి సమాచారం లేదు. అనుపమ సంగతి ఏమోగానీ, సమంత కూడా పెళ్లికి సిద్ధం అవుతుండటంతో త్రివిక్రమ్ అంత ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. అదీగాక ట్విట్టర్ లో పవన్ సినిమా చేస్తున్నారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత నిర్లక్ష్యంగా నో అని సమాధానం చెప్పటంతో త్రివిక్రమ్ ఫీలయ్యాడని, అందుకే ప్రాజెక్టు పరిశీలనలో శామ్ పేరును చేర్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అత్తారింటికి దారేదిలా ఇది మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందే తప్ప రాజకీయాల కోణంలో కాదని త్రివిక్రమ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Samantha  Trivikram Movie  

Other Articles