డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసిన మంచు లక్ష్మి..!!! | Manchulakshmi Donald Trump Phone Conversation

Manchulakshmi phone call to trump

Manchulakshmi Donald Trump, Manchulakshmi phone call Donald Trump, Mohan Babu Donald Trump, Donald Trump Manchu Family, Manchulakshmi funny tweet, Manchulakshmi tweet

Manchulakshmi makes a call to Donald Trump, And also speak with Mohan Babu Twitter trolls with tweet.

ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన మంచు లక్ష్మి?

Posted: 11/09/2016 04:38 PM IST
Manchulakshmi phone call to trump

మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తో ఏకంగా ఫోన్ లో మాట్లాడింది. అలా అని అభినందనలు తెలిపేందుకు కాదు సుమీ. మోహన్ బాబుతోపాటు తనతో కూడా ట్రంప్ ఫోన్ లో మాట్లాడాడని, మంచు ఫ్యామిలీతో మాట్లాడినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశాడంటూ ఓ ట్వీట్ వేసింది. కొంపదీసి అమెరికాలో ఉంది కదా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనుకునేరు.

నిజమే అనుకుంటున్నారా ఏంటి? కాదండీ బాబూ. సోషల్ నెట్ వర్క్ జోకుల్లో భాగంగా ఇది ఇప్పుడు భయంకరంగా పేలుతోంది. ఫేస్ బుక్, వాట్సాప్ లలో వైరల్ అవుతున్న సందేశాలలో ఇది కూడా ఒకటి ఉంది. మంచు లక్ష్మీ అఫీషియల్ ట్విట్టర్ ఫోటోతో సహా ఉన్న సందేశం అక్టోబర్ 23న పోస్ట్ చేసినట్లు ఓ ఫన్నీ ఫోటో పెట్టగా, ట్రంప్ గెలుపు నేపథ్యంలో అది బాగా వైరల్ అవుతోంది.

గెలిచిన ఆనందంలో ఉన్న ట్రంప్ కి మంచు లక్ష్మీ ఫోన్ అన్న హెడ్డింగ్ చూడగానే అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఫోటోషాప్ పుణ్యామాని ఈ జోకు ఇప్పుడు తెగ సందడి చేస్తోంది. ఇంతకుముందు ఇలాంటి జోకులు తనపై వచ్చినప్పటికీ పెద్ద మనసుతో లైట్ తీసుకున్న మంచువారమ్మాయి, ఇప్పుడు దీనిని కూడా అలాగే వదిలేస్తుందని ఆశిద్దాం.  అయినా గతంలో ట్రంప్ కంపు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ లచ్చక్క ఇంత ఫోన్ చేసి పలకరించేంత సీన్ చేస్తుందా చెప్పండి?

Manchulakshmi trump funny tweet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchulakshmi  tweet  Donald Trump  

Other Articles