పవన్ మొదలుపెడితే.. మహేష్ కూడా ఆ బాటలోనే... | pawan kalyan mahesh babu back to back movies in 2017.

After pawan mahesh also busy with back to back movies

First pawan Mahesh news, Mahesh follows pawan route, pawan and Mahesh in 2017, Mahesh pawan three movies in 2017, powerstar superstar 2017, Mahesh pvp movie 2017, Mahesh vamshi paidipally movie

After pawan kalyan Mahesh also busy with back to back movies and chances for three releases in 2017.

పవన్ తర్వాత మహేష్

Posted: 10/31/2016 11:46 AM IST
After pawan mahesh also busy with back to back movies

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు నలుగురి తర్వాత స్థానం కోసం జరుగుతున్న రేసులో ఈ ఇద్దరే టాప్ స్థానంలో ఉంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కాస్త అటు ఇటుగా ఈ ఇద్దరు అప్ అండ్ డౌన్లతో ఆయా పొజిషన్ లో కొనసాగుతుంటారు. మిగిలిన యువహీరోలు వీరి దరిదాపులోకి వచ్చినట్లే వచ్చి ఎప్పటికప్పుడూ వెనక్కి వెళ్లిపోతుంటారు. దానికి కారణం వీరి అభిమానులే అని అందరికీ తెలిసిందే. అయితే రెమ్యునరేషన్ విషయంలో కూడా అగ్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరిపై ఓ కామన్ కంప్లైంట్ మాత్రం ఉంది.

ఏడాది ఒకటి అది కూడా చాలా కష్టంగా తీస్తుంటారని! గత కొన్ని సంవత్సరాలుగా వీరి ట్రాక్ రికార్డు కూడా ఇదే ఫ్రూవ్ చేస్తోంది. 2011 తర్వాత ‘మహేష్’ దూకుడు ప్రదర్శిస్తోంటే... పవన్ మాత్రం ఆ విషయంలో మాత్రం చాలా వెనుకబడే ఉన్నాడని అభిమానులు తెగ ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు పవన్ బిజీ షెడ్యూల్ చూస్తే నమ్మశక్యం కావటం లేదు. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సినిమాలకు సిద్ధమయ్యాడు. రాజకీయాల కోసం సమయం కేటాయించే క్రమంలో అవసరం కావటంతోనే ఈ నిర్ణయం తీసుకోగా, పవర్ స్టార్ అభిమానులు వచ్చే ఏడాది ఖచ్ఛితంగా రెండు, వీలైతే మూడు సినిమాలతో పండగ చేసుకుంటారు.

ఇదే సమయంలో ఘట్టమనేని అభిమానులు కూడా మహేష్ నుంచి ఇలాంటి ఫీట్ నే ఆశించడంలో తప్పు లేదు కదా. అందుకే మురగదాస్ సినిమా ముగింపు దశకు చేరుకునే సమయానికి మరో ప్రాజెక్టుకు సిద్ధమయిపోయాడు. కొరటాల శివతో మరో మెసేజ్ ఓరియంటల్ సబ్జెక్టును తెరకెక్కించబోతున్నాడు. ఇంతలో పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి సినిమా విషయంలో ఇంతకాలం సందేహాలు ఉన్నప్పటికీ, కాష్మోరా సక్సెస్ మీట్ లో వరప్రసాద్ ఇచ్చిన క్లారిటీతో వచ్చే ఏడాదే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తం మీద అభిమానుల కోసమే ఈ ఇద్దరు స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో వచ్చే ఏడాది సందడి చేయబోతున్నారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Mahesh babu  2017 movies  three movies  

Other Articles