ట్విస్ట్ : ముష్కిల్ లో ఐష్ భర్తగా షారూఖ్! | Shahrukh Khan's Scene from ADHM leaked

Srk adhm scene deleted

Shahrukh Khan's Scene from ADHM leaked, SRK ADHM scene deleted, SRK ADHM scene, SRK in ADHM, SRK husband of Aish in ADHM, SRK scene in ADHM, ADHM versus Shivaay collections, ADHM upper hand firstday Collections

Shahrukh Khan's Scene from ADHM leaked and later deleted.

షారూఖ్ పాక్ నటుడు కాదు కదా?

Posted: 10/29/2016 04:13 PM IST
Srk adhm scene deleted

పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఒకే ఒక్క కారణానికి యే దిల్ హై ముష్కిల్ సినిమాకు ఎన్ని అవాంతరాలు ఎదుర్కుందో మనకు తెలుసు. చచ్చిచెడి చివరాఖరికి 5 కోట్ల నష్టపరిహార ఒప్పందం మేరకు ఎట్టకేలకు సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. పోటీగా శివాయ్ లాంటి భారీ బడ్జెట్ ఉండటంతో కలెక్షన్లు చీలిపోయినప్పటికీ, పై చేయి మాత్రం ముష్కిల్ దే అయ్యింది. అయితే ఇందులో ఇప్పటిదాకా దాచి ఉంచిన ఓ ట్విస్ట్ తో అంతా సర్ ప్రైజ్ అయిపోతున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇందులో ఓ గెస్ట్ రోల్ చేయటం. అవును... ఈ విషయం రిలీజ్ అయ్యేదాకా ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్. ఇక షారూఖ్ ది ఇందులో ఏం పాత్ర అనుకుంటున్నారు? ఐష్ మొగుడి పాత్రనంట. ఇంకేం సినిమాను స్క్రీన్ చూసిన కొందరు ఆ షాట్ లను తీసి తమ సోషల్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. అయితే అరబిక్ సబ్ టైటిల్స్ ఉండటంతో ఏదో సౌదీ దేశంలో దీనిని లీక్ చేసినట్లు ఉన్నారు. ఇండియన్ వర్షన్ లో మాత్రం దీనిని ఎడిటింగ్ లో లేపేశారంట. అందుకే మొదటి రోజు ఆటకు వెళ్లిన వాళ్లు కూడా దీనిపై ఏం స్పందించలేదు.

ఈ సీన్ లో షారూఖ్, ఐశ్వర్యలతోపాటు రణ్ బీర్ కూడా ఉండటం విశేషం. మరి ఈ సన్నివేశం తర్వాత అయినా ఎడిట్ చేస్తారా? అసలు ఆ సీన్ నిజమేనా? ఎవరైనా స్పందిస్తే పోలా... ఇక మొదటి రోజు ఏకంగా రూ. 13.30 కోట్లు వసూలుచేసి మల్టీప్లెక్స్ లో సత్తా చాటుతుండగా, డివైడ్ టాక్ వచ్చినా శివాయ్ రూ. 13.30 కోట్లు వసూలుచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharuk Khan  ADHM  Aishwarya rai husband  

Other Articles