కాలికి రక్తం వస్తున్నా... కమిట్ మెంట్... హాట్సాఫ్ | Actress rambha about NTR

Rambha about ntr dance commitment

rambha NTR, NTR Rambha, Rambha Bunny NTR, Bunny NTR, Rambha about NTR, NTR about Rambha, NTR dancing commitment, NTR Nachore song injure

Actress Rambha about NTR Dance commitment.

దటీజ్ ఎన్టీఆర్ కమిట్ మెంట్ - రంభ

Posted: 10/31/2016 01:05 PM IST
Rambha about ntr dance commitment

అఫ్ కోర్స్ టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే టాలీవుడ్ వరకు వచ్చేసరికి బేసిక్ గా క్లాసిక్ డాన్సర్ అయిన జూనియర్ కి, జిమ్నాస్టిక్ స్టెప్పుల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మధ్య ఈ విషయంలో ఎప్పుడూ పోటీ ఉంటుంది. కానీ, మాస్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలలో రిస్కీ స్టెప్పులు వేసే బన్నీకే కూసింత ఎక్కువ ఓట్లు పడతాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.

ఇదిలా ఉంటే వీరిద్దరి డాన్సుల గురించి ఎప్పటికప్పుడూ డిస్కషన్లు జరగటం, ఇద్దరికీ సమాన స్థాయి స్పందనలు రావటం మనం చూస్తున్నాం. ఆఖరికి సెలబ్రిటీలు, తోటి నటులు కూడా ఈ విషయంలో ఇలాంటి రెస్పాన్సే ఇస్తుంటారు. కానీ, యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ వేస్తన్న డాన్సులతో ఆ స్ట్రాటజీ మారిపోయింది. ఇదిలా ఉంటే ఇద్దరితోనూ చిందులేసిన సీనియర్ హీరోయిన్ రంభ తన ఓటు ఎన్టీఆర్ కే అని చెబుతూ ఎందుకో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇస్తుంది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ఆ మధ్య అడపా దడపా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి, అలరించింది తెలిసిందే కదా!. ఆ క్రమంలో బన్నీతో దేశముదురులో, తారక్ తో 'యమదొంగ' సినిమాలో జూనియర్ తో కలసి చిందులేసింది రంభ. ఆ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ సాంగ్ లో చాలా కష్టమైన మూమెంట్స్ ఉన్నాయని... వాటిని వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాలికి దెబ్బ తగిలి, రక్తం వచ్చిందని... అయినా ఆగకుండా అలాగే డ్యాన్స్ చేశాడని చెప్పింది. ఎన్టీఆర్ కమిట్ మెంట్ కు హ్యాట్సాఫ్ అని తెలిపింది. అంతేకాదు ఇప్పుడన్న హీరోల్లో విభిన్న పాత్రలు సమర్థవంతంగా పోషించడంగానీ, డైలాగ్ డెలివరీగానీ ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమని చెప్పింది రంభ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress rambha  NTR  nachorey song  injured  

Other Articles