చై..నే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? పవన్ తో ఇక నటించదా? | samantha says no for attarintiki daredi sequel

Samantha says no for attarintiki daredi sequel

Samantha not in Devude Digivochina, Samantha no for Attarintiki Daredi sequel, Samantha not in AD-2, Samantha no for Pawan Kalyan

Actress samantha says no for attarintiki daredi sequel. She is not in Pawan-Trivikram New Movie.

అత్తారింటికి కాంబోకి ‘నో’ చెప్పేసింది

Posted: 10/27/2016 10:31 AM IST
Samantha says no for attarintiki daredi sequel

తెలుగు చలనచిత్ర రికార్డులను చెరిపేసి తన కంటూ ఓ పదిలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం. ఫ్యామిలీ మొత్తం చూడదగిన చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చక్కగా అల్లిన కథ ముందు పైరసీ కూడా నిలవలేకపోయింది. వెరసి ఇండస్ట్రీలో కొత్త రికార్డులను క్రియేట్ చేసేసిందీ చిత్రం.

పవన్-త్రివిక్రమ్ గతంలో తీసిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఘన విజయం సాధించటంతో ముచ్చటగా మూడోసారి తెరపైకి రానున్న ఈ కాంబోపై అప్పుడే డిస్కషన్ లు మొదలయ్యాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ కూడా అల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇందులో సమంతతో నటింపజేయాలి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడని... అందుకు ఆ బ్యూటీ ఓకే చెప్పిందని, చాలా కాలంగా సినిమాలు లేకుండా ఉన్న సమంత బ్యాక్ అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే అదంతా గాలివార్తేనని తేల్చేసింది సమంత. అత్తారింటికి సీక్వెల్ అని చెప్పుకుంటున్న ఆ చిత్రంలో తాను నటించడం లేదంటూ నిన్న అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ దినపత్రిక ఆ విషయంపై కథనం రాయగా, దానిని పోస్ట్ చేసి మరీ ఓ అభిమాని విషయంపై ఆరాతీశాడు. ఆ సినిమాతో తాను లేనంటూ ఒక్క మాటలో తేల్చేసింది. ఇక నన్ను కాకుండా చై ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అని అడిగిన ఓ అభిమాని ప్రశ్నకు... ఎందుకంటే నువ్వు 8 ఏళ్ల క్రితం నాకు పరిచయం కాలేదు.. ఆపై నా బెస్ట్ ఫ్రెండ్ గా మారలేదంటూ సినిమా డైలాగులతో రిప్లై ఇచ్చింది. టోటల్ గా నిన్న అంతా ట్విట్టర్ లోనే అభిమానులతో గడిపేసింది సామ్.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Atarintiki Daredi sequel  Devude Digivochina  

Other Articles