హాట్ బ్యూటీని సీక్రెట్ పెళ్లి చేసుకున్న టాప్ రైటర్? | Actress Shubha Poonja marriage with writer nagendra prasad

Shubha poonja denies on secret marriage

Shubha Poonja wedding with writer nagendra prasad, Kannada writer nagendra prasad, Shubha Poonja nagendra prasad, Actress Shubha Poonja marriage photo, Actress Shubha Poonja secret wedding, Hot actress secret wedding popular writer, Kannda actress writer marriage pic

Shubha Poonja not secret wedding with writer nagendra prasad.

ఆ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి ఫోటో నిజమా?

Posted: 10/27/2016 10:09 AM IST
Shubha poonja denies on secret marriage

ఈ మధ్య హీరోయిన్ల సీక్రెట్ పెళ్లిళ్ల వ్యవహారం సోషల్ మీడియా మూలంగా తొందరగానే బయటపడిపోతున్నాయి. ఎవరో ఒకరు ఫోటో తీయటం, వాటిని తమ అకౌంట్లలో పోస్ట్ చేయటం, ఆపై ఆ పెళ్లిపై మీడియాలో కథనాలు రావటం, వారు దానిపై స్పందించడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. బిచ్చగాడు హీరోయిన్ సాట్నా టైటస్ డిస్ట్రిబ్యూటర్ కార్తీని కుటుంబ సభ్యుల ఒప్పుకోకపోవటంతో రహస్య వివాహం చేసుకోవటం, ఆపై అది మీడియాకు ఎక్కటం తెలిసిందే.

ఇక ఇప్పుడు కన్నడ నటి శుభా పూంజా వంతు వచ్చింది. ప్రముఖ కన్నడ రచయిత నాగేంద్ర ప్రసాద్ ను ఆమె వివాహం చేసుకుందన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఇది వరకే పెళ్లయిన నాగేంద్రను శుభా సీక్రెట్ పెళ్లి చేసుకుందని, వారి వైవాహిక జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో సందేశాలు పోస్ట్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటో నిజం కాదని నాగేంద్ర వాదిస్తున్నారు. ఆ వార్తతో తన భార్య అసంతృప్తి వ్యక్తం చేసిందని చెబుతున్నాడు.

ఇక శుభా ఆ వార్తపై మాట్లాడుతూ... ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం ఆ సన్నివేశం తీశామని, గుళ్లో ఉన్న ఎవరో అభిమాని అది నిజం అనుకుని ఫోటోను అప్ లోడ్ చేసి ఈ వార్తను రేపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. ఏదిఏమైనా వారిద్దరి టైమ్ లైన్ లలో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న ట్యాగ్ లైన్ మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandalwood actress  Shubha Poonja  writer nagendra prasad  secret marriage photo  

Other Articles