పవన్-త్రివిక్రమ్ అలాంటి ఆలోచన చేశారు. కానీ... | Pawan Kalyan and Trivikram producing plan change

Why pawan kalyan and trivikram production house failed

Pawan Kalyan and Trivikram planned to produce, Pawan Kalyan and Trivikram third movie, Trivikram not producing, Trivikram Producer, Trivikram Srinivas Pawan kalyan, Pawan Trivikram, why

Pawan Kalyan and Trivikram planned to produce small movies together but plans have changed.

పవన్-త్రివిక్రమ్ ఆ ఆలోచన మారిపోయింది

Posted: 10/20/2016 11:53 AM IST
Why pawan kalyan and trivikram production house failed

పెన్ను పట్టి సినిమాలకు కథ, మాటలు అందిస్తున్న రచయితలు ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకులుగా మారిపోతున్నారు. దశాబ్దం క్రితమే ఆ పని చేసిన సుకుమారు లాంటి వాళ్లు ఇప్పుడు నిర్మాతలుగా మారిపోయి కాసుల రుచి కూడా మరుగుతున్నారు. కొద్ది రోజులుగా మాటల మాంత్రికుడు కూడా ఆ జాబితాలోకి చేరిపోతాడని, అవసరాల, నందిని రెడ్డి లాంటి టాలెంట్ దర్శకులను ఎంకరేజ్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అసలు అది నిజమేనా?

జులాయి సినిమా దగ్గరి నుంచి నిర్మాత రాధాకృష్ణ బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనే (మధ్యలో ఒక్క అత్తారింటికి దారేది మినహాయించి) సినిమాలు వరుసగా చేస్తున్నాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ తో తర్వాత తీయబోయే సినిమా కూడా అదే బ్యానర్ లోనే. అంతటి అనుబంధం ఉన్న నిర్మాతలను కాదని త్రివిక్రమ్ నిర్మాతగా మారే ఛాన్స్ అస్సలు లేదని తెలుస్తోంది. అంతే కాదు ఆ ఇద్దరి కోసం ఈ బ్యానర్ తోపాటు, రాధాకృష్ణ మరో బ్యానర్ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ప్రొత్సహించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడంట. అలాంటి సమయంలో తనపై ఇలాంటి వార్తలు రావటం కలచివేసిందని సన్నిహితులు చెబుతున్నారు.

అదే సమయంలో ఇక్కడ మరో వాదన వినిపిస్తోంది. ఆ మధ్య ఒకానోక టైంలో పవన్, త్రివిక్రమ్ కలిసి ఓ ప్రొడక్షన్ సంస్థ పెట్టి చిన్న సినిమాలు తీయాలని ఫ్లాన్ కూడా వేసుకున్నారంట. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం అని భావించి ఆ ఆలోచనను పక్కకు పెట్టేశారు. కానీ, తమ మూడో సినిమాను మాత్రం ఆస్థాన బ్యానర్ లోనే తీసేయడానికి ఇద్దరు సిద్ధమైపోతున్నారు. ఇక ఆ ఇద్దరు యువ దర్శకుల బాధ్యతను రాధాకృష్ణ అల్లుడి చేతిలో (సితార ఎంటర్ టైన్ మెంట్స్) పెట్టినట్లు భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  Producction House  

Other Articles