హ... గ్గదీ ఎన్టీఆర్ లెక్క | Janatha Garage completed 50 days

Janatha garage completed 50 days

Janatha Garage 50 Days, NTR Janatha Garage 50 Days, Garage 50 days celebrations, Janatha garage 50 days poster, Garage 50 days theaters, Janatha Garage alf century

NTR Janatha Garage successfully completed 50 Days.

గ్యారేజ్ కి ఎంత సీన్ ఉందో తెలిసిందా?

Posted: 10/20/2016 11:39 AM IST
Janatha garage completed 50 days

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో కొరటాల శివ జనతా గ్యారేజ్ తో మరిచిపోలేని హిట్ అందించాడు. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవటమే కాదు... దెబ్బకి ఇండస్ట్రీలో పలు రికార్డులు గల్లంతై ఏకంగా సెకండ్ ప్లేస్ లో నిలిచిందీ చిత్రం. నేటితో విజయవంతంగా 50వ రోజు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జయహో జనతా అంటూ ఓ పోస్టర్ ను వదిలింది. మొత్తం 39 కేంద్రాల్లో గ్యారేజ్ అర్థశతదినోత్సవం జరుపుకుంటుంది. నైజాం లో 6, సీడెడ్ లో 8, ఆంధ్రాలో మొత్తం 25 థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా సినిమా రన్ అవుతోంది. ప్రకృతి ప్రేమికుడిగా, ఇంకోవైపు జనాల కోసం పాటుపడే వ్యక్తి నుంచి వారసత్వం తీసుకుని నడిచే నాయకుడిగా కొరటాల ఎన్టీఆర్ ను బాగా చూపించాడు. రిలీజ్ అయిన సమయంలో నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ, క్రమంగా జనాలకు ఎక్కడం, దానికి తోడు సరైన సినిమాలు లేకపోవటం బాగా కలిసొచ్చింది. కంటెంట్ మాములుదే అయినప్పటికీ, ఎక్కువ శాతం ఎమోషనల్ అంశాలను నింపటం, దానికి ప్రధాన తారగణం ఫెర్ ఫార్మెన్స్, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించడం చక్కగా కుదిరాయి.

ఇక కలెక్షన్ల విషయానికొస్తే... ఫాస్ట్ గా 50 కోట్లు, వందకోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా 135 కోట్ల పైగానే కలెక్షన్లు సాధించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక మళయాళ నటుడు మోహన్ లాల్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ లు ఎన్టీఆర్ కి జోడిగా నటించారు. సచిన్ కేల్కర్, మళయాళ యువనటుడు ఉన్ని ముకుందన్ నెగటివ్ రోల్స్ లో కనిపించారు. 50 రోజుల వేడుక అఫీషియల్ గా జరిపే విషయంపై చిత్ర యూనిట్ మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయపోయినప్పటికీ, పోస్టర్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage 50 days  celebrations  

Other Articles