దంగల్ సుల్తాన్ పెద్ద తేడా లేదు! | Aamir Khan's Dangal compare with sultan

Aamir khan s dangal trailer released

Dangal trailer, Aamir Khan Dangal Trailer, Aamir Khan's Dangal Trailer, Dangal Sultan, Sultan Dangal, Dangal Story, Dangal not impressive

Aamir Khan's Dangal trailer released.

దంగల్ ట్రైలర్: సుల్తాన్ తో కంపేర్ చేయకుంటే...

Posted: 10/20/2016 12:54 PM IST
Aamir khan s dangal trailer released

బయోపిక్ లకు బాలీవుడ్ లో ఉన్న ప్రాధాన్యం గుర్తిస్తున్న స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో వాటిపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు క్రీడా రంగంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు తెర వెనుక ఉంటున్న వారి జీవితాలను, తెరపై చూపిస్తూ, కలెక్షన్లను కుమ్ముకుంటున్నారు. అదే టైంలో ఆయా పాత్రల కోసం వారు పడే కష్టం కూడా అంతా ఇంతా కాదు. అమీర్ కూడా ఇప్పుడు అంతే కష్టం పడినట్లు అనిపిస్తుంది.
 
అమీర్‌ ఖాన్‌ లీడ్ రోల్ లో ఇండియన్‌ రెజ్లర్‌ మహ్‌వీర్‌ సింగ్‌ జీవిత కథగా తెరకెక్కిన ‘దంగల్‌’ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. ఈ సినిమా కథను మొత్తం ట్రైలర్‌లో చూపించగా, ట్రైలర్ లోనే అమీర్‌ ఖాన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు.ప్రీతమ్‌ చక్రవర్తి అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ట్రైలర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది. తాను సాధించలేకపోయిన లక్ష్యాన్ని ఎలాగైనా తన వారసుల ద్వారా సాధించాలనుకుంటాడు. కానీ, అమ్మాయిలు పుట్టడంతో ఆ ఆశను చంపుకోగా, ఒక రోజు ఓ కొట్లాట ద్వారా వాళ్ల ప్రతిభ తెలుస్తుంది. అంతే వాళ్లను రాటుదేల్చి ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతాడు.

అయితే ట్రయిలర్ అంతా బాగా ఉన్నప్పటికీ, సల్మాన్ సుల్తాన్ పోలికలు ఇందులో చాలా కనిపిస్తున్నాయి. పైగా ఇందులో కూడా జాట్ వ్యక్తి కావటం, ఆ భాష మొత్తం అలాగే ఉంది.  కానీ, ఇది రియల్ స్టోరీ కావటంతో ఆ ఫీల్ వేరేలా ఉండొచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 నితేష్‌ తివారి దర్శకత్వం వహించగా అమీర్ కుమార్తెలు, రెజ్లర్లు గీతా పొగట్‌, బబితా కుమారి పాత్రలలో ఫాతిమా సనా, సన్యా మల్హోత్రా నటించారు. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌, డిస్నీ వరల్డ్‌ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Dangal  trailer  

Other Articles