ఎడిటింగ్ లో కూడా లేపే ఛాన్స్ లేదు... ఏం చేస్తారు? | Ae Dil Hai Mushkil and Dear Zindagi in release trouble

Karan two movies in deep trouble

Ae Dil Hai Mushkil and Dear Zindagi, Pak actors in Indian Movies, Dear Zindagi cut for Zafar in trailer, Zafar and Fawad troubles for those movies, Dear Zindagi depends on AYDM result

Ae Dil Hai Mushkil and Dear Zindagi in deep trouble before release date arriving.

పాక్ నటులపై ఏం డెసిషన్ తీసుకుంటారు

Posted: 10/18/2016 11:05 AM IST
Karan two movies in deep trouble

సరిహద్దు అంశంతో పాక్ నటీనటులపై బ్యాన్ విధించాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో అల్రెడీ వాళ్లు చేసిన సినిమాల సంగతి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో షారూఖ్, రణ్ బీర్ లాంటి స్టార్ల సినిమాలు ఉండటంతో ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఆయా సినిమాలను రిలీజ్ కాకుండా చూస్తామని శివసేన, ఎంఎన్ఎస్ లాంటి సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్, అలియా భట్ జంటగా నటించిన డియర్ జిందగీ చిత్రంలో పాక్ నటుడు అలీ జాఫర్ ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా కాబోతుంది. అయితే అందులో అలీని అల్రెడీ ఎడిట్ చేసిన చిత్ర యూనిట్, సినిమా పార్ట్ వరకు ఉంచుతుందా? లేదా? అన్నది ఇప్పడు అసలు సమస్య. కరణ్ జోహర్ యే దిల్ హై ముష్కిల్ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఇందులో పాక్ నటుడు ఫావద్ ఖాన్ ఎడిటింగ్ లో కూడా తీసేయలేనంత ముఖ్య పాత్ర పోషించాడు.

దీంతో ఈ రెండు చిత్రాల భవితవ్యం ఏంటా అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. యే దిల్... సినిమా ఫలితం చూశాక తమ నిర్ణయం ప్రకటించాలని డియర్ జిందగీ చిత్ర యూనట్ భావిస్తోంది. అయితే అల్రెడీ జాఫర్ పై రెండు పాటలు కూడా ఉన్నట్లు ఇది వరకే దర్శకుడు గౌరీ షిండే ప్రకటించడంతో ఎలాంటి మార్పులు చేస్తాడా? అని అనుకుంటున్నారు. అక్టోబర్ 28న యే దిల్ హై ముష్కిల్, నవంబర్ 25న డియర్ జిందగీ రిలీజ్ కానున్నాయి.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ae Dil Hai Mushkil  Dear Zindagi  Pak actors  Indian movies  Release  

Other Articles