ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయిన టీవీ నటి.. సాలా, కమినా అని తిడుతోంది | TV actress fooled by Mumbai Auto driver

Tv actress fooled by mumbai auto driver

Mumbai auto-driver cons actress, Megha Chakraborty with fake Rs 100 note, Megha Chakraborty cheated by Auto Driver, Auto driver cheated tv actress

Mumbai auto-driver cons actress Megha Chakraborty with fake Rs 100 note.

ఆటోడ్రైవర్ తో నటికి చేదు అనుభవం

Posted: 10/18/2016 12:18 PM IST
Tv actress fooled by mumbai auto driver

ఎవరైనా మోసపోతే పెద్దగా పట్టించుకోకపోవచ్చేమోగానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం అది సమ్ థింగ్ స్పెషలే. అయితే అది మరీ సిల్లీగా ఉంటే ఎలా ఉంటుంది. ముంబై టీవీ నటి మేఘా చక్రవర్తి కి అలాంటి అనుభవమే ఎదురైంది. అది కూడా ఓ ఆటో డ్రైవర్ చేతిలో...

ఇంతకీ అతగాడు ఏం చేశాడు అనేగా... ఏం లేదు. ఓ ఫేక్ వంద రూపాయల నోటు ఇచ్చాడు. ఆ మాత్రం దానికే అంటారా? ఓసారి అది జాగ్రత్తగా చూడండి. పిల్లలు ఆడుకునే నోటు ఇచ్చి ఆమెను బురిడీ కొట్టించాడు ఆ డ్రైవర్. శనివారం సాయంత్రం బయటికి వెళ్లిన మేఘా తిరిగి ఇంటికి వచ్చేందుకు ఓ ఆటో మాట్లాడుకుంది. తీరా ఆటో దిగాక అతగాడు ఓ వంద రూపాయల నోటును మడిచి ఆమె చేతిలో పెట్టాడు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి దానిపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్లేస్ లో చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. తాను బకరా అయిన విషయాన్ని పసిగట్టిన ఆమె ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంది.

ఆ నోటు చాలా దారుణం. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. పైగా ఏక్ సౌ కూపన్ అని రాసి ఉంది. ముంబై ఆటోవాలా చేతిలో ఫూల్ అయ్యాను. సాలా కమినా అంటూ తిట్ల దండకం అందుకుంది. ఆ పోస్టుకు 10 వేల దాకా లైకులు రాగా, వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. జిందగీ చానెల్ లో ప్రసారమయ్యే కాబోన్ కి జమీన్ పర్ అనే సీరియల్ ద్వారా మేఘా బాగా పాపులర్ అయ్యింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles