సర్దార్ ఫీట్ రిపీట్ చేయడు కదా? | Khaidi insane business more than logic

Insane business more than logic for chiru 150

Khaidi insane business, chiru 150 pre release business, Khaidi beats Baahubali record for rights, Khaidi no.150 more than bahhubali

ram charan insane business more than logic for Khaidi No.150

చిరు 150 తేడా కొడితే మాత్రం బొగ్గు

Posted: 10/18/2016 10:19 AM IST
Insane business more than logic for chiru 150

చిరు గ్రాండ్ రీఎంట్రీని చరిత్రలో చిరస్థాయిగా నిలపాలని చూస్తున్నాడు తనయుడు, చిత్ర నిర్మాత రాంచరణ్. ఇందుకోసం మెగా పవర్ స్టార్ భారీగా ఖర్చుపెట్టడమే కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా భారీగా చేస్తున్నాడు. ఇప్పటికే ఓవర్సీస్ హక్కులను భారీగా అమ్మిన చెర్రీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల హక్కులను కూడా రికార్డుస్థాయిలోనే అమ్మేశాడు.

మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు దాదాపు 32 కోట్లకు అమ్ముడు పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది బాహుబలి(30 కోట్లు) కంటే ఎక్కువ.  వైజాగ్ లో రికార్డు స్థాయిలో 7.70 కోట్లు కాగా, బాహుబలి 7.20 కోట్లకు అమ్మడుపోయింది. ఇక గుంటూరులో 6.50 కోట్లకు క్లోజ్ చేసేశాడంట. ఈ లెక్కన నైజాం లో కూడా మెగా స్థాయలోనే అమ్మకం అయినట్లు సమాచారం. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా మతి పోవటం ఖాయమే. ఇప్పుడు వస్తున్న చిక్కల్లా ఒక్కటే.

తొమిదేళ్ల తర్వాత మేకప్ వేసుకుంటున్న మెగాస్టార్ కి అంత కలెక్షన్లు రాబట్టే సీన్ ఉందా? అని. బాహుబలి మల్టీ లాంగ్వేజ్ మూవీ. అలాంటి దానితో కంపేర్ చేసుకుంటూ చరణ్ చేస్తున్న ప్రయత్నంలో ఏ చిన్న తప్పు జరిగినా టోటల్ గా చిరు ఇమేజ్ డ్యామేజ్ అవటమే కాదు, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అయితే చిరుకి ఉన్న భారీ ఫ్యాన్స్ తలుచుకుంటే ఈ ఫీట్ సాధించడం పెద్ద సమస్య కాదన్న ధీమాతో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాస్త నెగటివ్ టాక్ వచ్చినా సరే గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కి జరిగినట్లు పెద్ద దెబ్బే పడటం మాత్రం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 movie  Pre Release Business  more than baahubali  

Other Articles