అవార్డుల గురించి దాసరి ప్రభుత్వాలకు చురక | Dasari blasts Govts for not Honouring artists

Dasari blasts govts for not honouring artists

Dasari Nayana Rao fire on govts, Dasari about honouring artists, Dasari about artists, dasari about awards, Dasari blasts Govts

Dasari Narayana Rao blasts Govts for not Honouring artists

దాసరి చెప్పేదాంట్లో తప్పేముంది?

Posted: 08/17/2016 04:40 PM IST
Dasari blasts govts for not honouring artists

ఎప్పుడు మైక్ అందుకున్నా అగ్రహీరోలు, నిర్మాతలు అంటూ మాట్లాడి వివాదాలు లేపే దర్శకరత్న దాసరి నారాయణ రావు తాజాగా ప్రభుత్వాలపైనే విరుచుకుపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంతోషం అవార్డుల వేడుక సందర్భంగా దాసరి చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే...

ఓవైపు సంతోషం అవార్డుల నిర్వాహకుడు సురేష్ కొండేటిని అభినందిస్తూనే...ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలు అంటించాడు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సినీ రంగానికి ఒకప్పుడు ప్రభుత్వాలు చాలా చేసేవి, కానీ, ఇప్పుడు అలాంటి దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించాడు.

విభజనకు ముందు నంది అవార్డులను అందించిన ప్రభుత్వం రెండుగా విడిపోయాక వాటిని పూర్తిగా విస్మరించింది. ఏపీ సంగతి పక్కనబెడితే వాటి పేరు మార్చి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త అవార్డులు ఇస్తామని టీ ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు గడుస్తుంది. అయినా ఇంతవరకు ఏ పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తూతూ మంత్రంగా సినీ రంగానికి ఏదో సేవ చేస్తున్నాం అనే చెప్పుకోవటమే కాదు, ఆచరణపూర్వకంగా అవార్డుల వేడుకలను నిర్వహించి చిత్ర పరిశ్రమను ప్రొత్సహించాలన్న దాసరి మాటలకు ఈసారి మద్ధతు బాగానే లభిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  telugu Governments  honouring artists  

Other Articles