ప్రభాస్ బర్త్ డే కానుకగా బాహుబలి 2 ఫస్ట్ లుక్ | Baahubali 2 First Look Date Confirmed

Baahubali 2 first look date confirmed

The first look of Baahubali The Conclusion, Baahubali The Conclusion making, Prabhas birthday baahubali 2 first look, baahubali 2 first look, Prabhas first look baahubali 2, Baahubali video on Prabhas birthday, Baahubali part 2 first look

The first look of Baahubali The Conclusion will be revealed on October 23rd on the occasion of the lead actor Prabhas’s birthday. Already, in the past for the first part, the makers revealed a special making video of the film for Prabhas birthday and now, they might come up with a first look this year.

బాహుబలి 2 ఫస్ట్ లుక్ తేదీ ఫిక్స్?

Posted: 08/17/2016 06:17 PM IST
Baahubali 2 first look date confirmed

బాహుబలి ఫస్ట్ లుక్ లతో సినిమా ప్రమోషన్లను కొత్త పుంతలు తొక్కించాడు దర్శకధీరుడు రాజమౌళి. చిత్రంలోని ఒక్కో నటీనటుల పాత్రల పోస్టర్లను, టీజర్లను, మధ్యలో మేకింగ్ వీడియోలను విడుదల చేసి చిత్రంపై అంచనాలు పెంచడంతోపాటు, సోషల్ మీడియాలో ప్రచారం చేసే పద్ధతిని నేర్పించాడు. ఆ తర్వాత చాలా సినిమాలు దీనిని ఫాలో అవుతూ వస్తున్నాయి.

ఓవైపు కంక్లూజన్ కోసం రాత్రిపగలు ఎడతెరపనీయకుండా షూటింగ్ చేస్తున్న జక్కన్న అండ్ టీం అన్ని విషయాల్లో గోప్యతను ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి పార్ట్ కోసం చేసినట్లే రెండో పార్ట్ కోసం ప్రభాస్ పుట్టినరోజును వాడుకోవాలని రాజమౌళి యోచిస్తున్నాడు.

మొదటి పార్ట్ సమయంలో షూటింగ్ ఆలస్యం కావటంతో, ప్రభాస్ అభిమానుల కోసం 2013 అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిన్న టీజర్ రూపంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి పుట్టినరోజుకు పార్ట్ 2 ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నాడని సమాచారం అందుతోంది. ఇక సినిమా విడుదల తేదీలో మరోసారి జాప్యం జరుగుతుందని వస్తున్న వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా కొట్టిపారేసింది. అనుకున్న తేదీకే ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదల అవుతుందని తేల్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనగా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నాటికి టాకీ పార్టు సహా పాటలన్నింటిని పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  first look  prabhas  birthday  

Other Articles